సమాజంలో వైద్యులకు ఉండే గౌరవం అంతాఇంతా కాదు.మన దేశంలో ఎంతోమంది డాక్టర్లు కోట్ల ఆస్తులను కలిగి ఉన్నారు.
అయితే ఇండియాలో రిచెస్ట్ డాక్టర్ ఎవరనే ప్రశ్నకు మాత్రం నరేష్ ట్రెహాన్ పేరు సమాధానంగా వినిపిస్తుంది.నరేష్ ట్రెహాన్ వయస్సు ప్రస్తుతం 77 సంవత్సరాలు కాగా ఆయన ఇప్పటివరకు 48 వేల ఓపెన్ హార్ట్ సర్జరీలు చేసి వార్తల్లో నిలిచారు.
ఈయన ఆస్తుల విలువ ఏకంగా 8400 కోట్ల రూపాయలు కావడం గమనార్హం.ఒకవైపు డాక్టర్ గా కొనసాగుతూనే మరోవైపు సక్సెస్ ఫుల్ బిజినెస్ మేన్ గా ఎదిగి నరేష్ టెహ్రాన్( Naresh tehran ) ఈ స్థాయిలో ఆస్తులను సంపాదించారు.
ఎన్నో విజయాలను ఖాతాలో వేసుకున్న నరేష్ టెహ్రాన్ సక్సెస్ స్టోరీ ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తుందని చెప్పడంలో సందేహం అవసరం లేదు.కొన్ని టీవీ షోలలో కూడా ఆయన పాల్గొన్నారు.
నరేష్ ట్రెహాన్ హాస్పిటల్ పేరు మెదాంత( Medanta ) కాగా ఈ హాస్పిటల్ షేరుకు కూడా ఎంతో విలువ ఉంది.

మన దేశంలో ఎక్కువ సంఖ్యలో ఆస్పత్రులను కలిగి ఉన్నవారిలో నరేష్ టెహ్రాన్ కూడా ఒకరు కావడం గమనార్హం.అమెరికాలో చదువుకుని అక్కడే కొంతకాలం పాటు డాక్టర్ గా పని చేసిన నరేష్ టెహ్రాన్ రెసిడెంట్ డాక్టర్ గా పని చేసి ప్రశంసలు అందుకున్నారు.48,000 కంటే ఎక్కువ ఓపెన్-హార్ట్ సర్జరీలు( Open heart surgeries ) చేయడం అంటే రికార్డ్ అనే చెప్పాలి.ఈ రికార్డ్ ను బ్రేక్ చేయడం సులువు కాదని చెప్పవచ్చు.

గుండెపోటు రాకుండా ఉండాలంటే పాటించాల్సిన నియమాలను సైతం ఆయన వెల్లడించారు.ఏడు పదుల వయస్సులో కూడా వైద్య చికిత్సలు అందిస్తూ ఎంతోమందికి నరేష్ ట్రెహాన్ ఆదర్శంగా నిలుస్తున్నారు.నరేష్ టెహ్రాన్ ( Naresh tehran )కు ఈ విజయం సులువుగా దక్కలేదు.
రేయింబవళ్లు ఎంతో కష్టపడి నరేష్ టెహ్రాన్ ఈ స్థాయికి చేరుకున్నారు.







