అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్( ICC ) క్రికెట్ లో ఓ సరికొత్త రూల్ స్టాప్ క్లాక్( Stop Clock ) అనే నిబంధనను రేపటి నుంచి అందుబాటులోకి తీసుకురానుంది.స్టాప్ క్లాక్ నిబంధన అంటే ఏమిటో తెలుసుకుందాం.
పొట్టి ఫార్మాట్ లో ఓవర్ కు ఓవర్ కు మధ్య అధిక సమయం వృధ అవుతుందని భావించిన ఐసీసీ.ఈ స్టాఫ్ క్లాక్ నిబంధనను అందుబాటులోకి తెచ్చింది.
ఈ నిబంధన ప్రకారం ఓవర్ కు ఓవర్ కు మధ్య 60 సెకండ్ల సమయాన్ని మాత్రమే గ్యాప్ టైం గా ఫిక్స్ చేసింది.అంటే ఒక ఓవర్ పూర్తయిన తర్వాత 60 సెకండ్ల కాలంలో మరో ఓవర్ ప్రారంభించాలి.
రెండుసార్లు ఈ నిర్దిష్ట వ్యవధి దాటితే మూడోసారికి బౌలింగ్ జట్టుకు ఐదు పరుగుల పెనాల్టీ( Five Runs Penalty ) విధిస్తారు.
అంటే బ్యాటింగ్ జట్టుకు అదనంగా 5 పరుగులు యాడ్ అవుతాయి.ఫీల్డ్ అంపైర్లు( Field Umpires ) స్టాప్ క్లాక్ తో ఈ సమయాన్ని నిర్ధారిస్తారు.నవంబర్ 21న అహ్మదాబాద్ లో జరిగిన క్రికెట్ బోర్డ్ సమావేశంలో స్టాప్ క్లాక్ నిబంధన అమలుపై ఐసీసీ నిర్ణయం తీసుకుంది.
డిసెంబర్ 12వ తేదీ ఇంగ్లాండ్ వర్సెస్ వెస్టిండీస్( Eng vs WI ) మధ్య ప్రారంభమయ్యే ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ నుంచి ఈ స్టాప్ క్లాక్ నిబంధనను ఐసీసీ ఆచరణలో పెట్టనుంది.
ఈ కొత్త నిబంధన ఏప్రిల్ 2024 వరకు ప్రయోగాత్మకంగా అమల్లో ఉంటుంది.ఈ స్టాప్ క్లాక్ నిబంధన పురుషుల టీ20, వన్డే ఫార్మాట్ లలో అమల్లో ఉంటుంది.ఏప్రిల్ 2024 తర్వాత ఈ నిబంధన టీ20 వరల్డ్ కప్ లో ఉంటుందా లేదా అనే దానిపై ఐసీసీ స్పష్టత ఇవ్వనుంది.
కేవలం మ్యాచ్ సమయం వృధా కాకుండా ఆదా చేసేందుకు మాత్రమే ఐసీసీ ఈ నిబంధనను అమల్లోకి తీసుకురానుంది.