వైరల్ వీడియో: ఈ చిట్టి కప్ప వాయిస్ వింటే స్టన్ అవుతారు..

కొన్ని జంతువులు వర్షం కురిసినప్పుడు ప్రత్యేక శబ్దాలు చేస్తాయి, తద్వారా అవి అక్కడ ఉన్నాయని మనకు తెలియజేస్తాయి. కప్పలు( Frogs ) అరుస్తుంటే త్వరలోనే వర్షం ( Rain ) పడుతుందేమో అని చాలామంది భావిస్తారు.

 Unexpected Sound Of A Desert Rain Frog Video Viral Details, Viral Video, Viral N-TeluguStop.com

కప్పలు ఎలా అరుస్తాయో, వాటి సౌండ్ గుర్తుండే ఉంటుంది.అయితే ఒక కప్పు మాత్రం చాలా వెరైటీగా, ఏదో కీచు బొమ్మలాగా అరుస్తూ ఆశ్చర్యపరుస్తోంది.

ఈ కప్ప వేరే రకమైనది.ఇది చాలా ఆశ్చర్యకరమైన శబ్దం చేసే ప్రత్యేకతను కలిగి ఉంది.

దీనిని డెసర్ట్ రెయిన్ ఫ్రాగ్( Desert Rain Frog ) లేదా ఎడారి వర్షం కప్ప అని పిలుస్తారు.ఇది నమీబియా మరియు దక్షిణాఫ్రికాలోని ఇసుక దిబ్బలలో నివసిస్తుంది.

ఇది చాలా చిన్నది, అందమైనది, పసుపు-గోధుమ రంగు చర్మం, పెద్ద కళ్ళతో ప్రత్యేకంగా కనిపిస్తుంది.ఇది ఇతర కప్పల వలె దూకదు, కానీ ఇసుక మీద నడుస్తుంది.ఇది దాని చర్మంపై ఒక సీ-త్రూ ప్యాచ్‌ను కలిగి ఉంది, అది దాని లోపలి భాగాన్ని చూపుతుంది.ఈ కప్పకు సంబంధించిన వీడియో ఒకటి ఎక్స్‌ సోషల్ మీడియా వైరల్‌గా మారింది.

ఆ వీడియోను @gunsnrosesgirl3 అకౌంట్ పోస్ట్ చేసింది, ఆ కప్ప బురదలో కప్పబడిందని గుర్తించారు.కప్ప పిల్లల బొమ్మలాగా హైపిచ్ కీచు శబ్దం( High Pitch Sound ) చేసింది.

“ఈ ఎడారి వర్షం కప్ప ఊహించని శబ్దం వినండి” అనే క్యాప్షన్ ఈ వీడియోకి జోడించారు.చాలా మంది ఈ వీడియోను చూసి లైక్ చేశారు.కప్ప సౌండ్ విని తాము షాక్ అయ్యామని చాలా మంది అన్నారు.మరికొందరు ఇది సాధారణ కప్పలా ఉందని, కానీ వాయిస్ మాత్రం నమ్మలేనటువంటి విధంగా ఉందని అన్నారు.

ఈ వీడియోకు లక్షల్లో వ్యూస్, వేలల్లో లైకులు వచ్చాయి దీనిని మీరు కూడా చూసేయండి.ఈ వీడియో చాలా మందికి ఎడారి వర్షం కప్పపై ఆసక్తిని కలిగించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube