కొత్త కార్ కొనాలనుకుంటున్నారా..2024 ఏడాది ఆరంభంలో మార్కెట్లోకి వచ్చే కార్లు ఇవే...!

కొత్త కారు కొనాలని అనుకునేవారు కొన్ని రోజులు ఆగితే.మార్కెట్లోకి ప్రముఖ కంపెనీల నుంచి సరికొత్త కార్లు విడుదల అవ్వనున్నాయి.ఆ కార్ల వివరాలు ఏమిటో తెలుసుకుందాం.

 2024 New Car Models Best Car To Buy Details, 2024 New Car Models, Best Car , New-TeluguStop.com

New Hyundai Creta:

భారతదేశంలో మన అభిరుచికి అనుగుణంగా విభిన్న స్టైలింగ్ తో విభిన్న వేరియంట్ లలో న్యూ హ్యుందాయ్ క్రెటా( New Hyundai Creta ) లభిస్తుంది.సరికొత్త డిజైన్ తో రానుంది.ఈ కారు చూడడానికి గ్లోబల్ హ్యుందాయ్ SUV లాగా ఉంటుంది.ఈ కారులో 360 డిగ్రీ కెమెరా, ADAS, 18 అంగుళాల వీల్స్ తో ఉంటుంది.1.5 లీటర్ పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ తో పాటు శక్తివంతమైన 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ను పొందుతుంది.2024లో భారత మార్కెట్లో కనిపించనుంది.

Telugu Car Models, Car, Buy Car, Hyundai Creta, Tata Curvv, Top Car Models-Techn

Citroen C3X sedan:

ఈ కారు సెడాన్ షేప్లో ఉండే ఒక క్రాస్ ఓవర్.ఈ కారులో ప్రత్యేకంగా రాడికల్ స్టైలింగ్ థీమ్ ఉంటుంది.కన్వెన్షనల్ SUV లాగా గ్రౌండ్ క్లియరెన్స్ పొందుతుంది.ఈ కారులో ఉండే ఇంజన్ ఆప్షన్ సీ3 ఎయిర్ర్కాస్ లాగా ఉంటుంది.ప్రస్తుతం మార్కెట్లో ఉండే ఈ కంపెనీకి చెందిన కార్ల కంటే ఈ కారులో ఇంటీరియర్ ఇంకా ఎక్కువ ప్రీమియంగా ఉండే అవకాశం ఉంది.

Telugu Car Models, Car, Buy Car, Hyundai Creta, Tata Curvv, Top Car Models-Techn

మహీంద్రా థార్ 5 డోర్:

ఈ కారు అదనపు డోర్లతో అత్యంత విలాసవంతంగా ఉంటుంది.ప్రస్తుతం ఉండే థార్( Thar ) కంటే ఎక్కువ ప్రీమియం ఫీచర్లతో విభిన్న స్టైలింగ్ థీమ్ ను కలిగి ఉంటుంది.అయితే ఈ కార్ ధర భారీగా ఉండే అవకాశం ఉంది.2024లో భారత మార్కెట్లో కనిపించనుంది.

Telugu Car Models, Car, Buy Car, Hyundai Creta, Tata Curvv, Top Car Models-Techn

టాటా కర్వ్:

కర్వ్ అంటే ఒక పెద్ద SUV అని అర్థం.ఈ కారు నెక్సాన్ కంటే పైన ఉండనుంది.ఇంటీరియర్ పూర్తి టాప్ ఎండ్ ఫీచర్లతో ఉంటుంది.భారతదేశంలో కర్వ్( Tata Curvv ) ఈవీ రూపంలో లాంచ్ అయింది.400 నుంచి 500 కిలోమీటర్ల మధ్య మంచి రేంజ్ ను పొందుతుంది.కొత్త కారు కొనాలి అనుకునేవారు మరికొన్ని రోజులు ఆగితే.త్వరలోనే ఈ కార్లు భారత మార్కెట్లో విడుదల అవుతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube