తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ఉన్నప్పటికీ కొంత మంది హీరోలు మాత్రమే సక్సెస్ అవుతూ వస్తున్నారు.ముఖ్యంగా ఇక్కడ టాలెంట్ ఉన్నా కూడా హీరో గా సక్సెస్ అవ్వాలంటే మాత్రం సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే హీరోలుగా కొనసాగుతూ ఉంటారు.
అలాగే వాళ్ళ మార్కెట్ కూడా విపరీతంగా పెరుగుతూ ఉంటుంది.ప్రస్తుతం తెలుగులో ఉన్న హీరోల్లో కొంత మంది హీరోలు మాత్రం వరుసగా సినిమాలు చేస్తూ వాళ్ల మార్కెట్ అనేది పెంచుతూ పోతున్నారు…ఇక అందులో భాగంగానే విజయ్ దేవరకొండ,నాని, శర్వానంద్ లాంటి హీరోలు ముందు వరుసలో ఉన్నారు…

విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) అయితే నాని నటించిన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో ఒక చిన్న పాత్ర లో నటించి ఆ తర్వాత పెళ్లి చూపులు అనే సినిమాతో సోలో హీరోగా మారి మంచి విజయాన్ని అందుకున్నాడు.ఇక తర్వాత అర్జున్ రెడ్డి సినిమాతో ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి ఇమేజ్ ను ఏర్పాటు చేసుకొని స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు.ఇక ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో తన సత్తాని చాటుతున్నాడు… ఇక అందులో భాగంగానే వరుసగా సినిమాలు చేస్తూ తనకంటూ ఒక రేంజ్ ను సంపాదించుకుంటున్నాడు… ఇక ఇదే క్రమంలో నాని( Nani ) కూడా వరుసగా సినిమాలు చేస్తూ తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకుంటూ వరుసగా సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు ఇలాంటి క్రమంలో నాని చేసే సినిమాలు కూడా ప్రేక్షకులందరిని మెప్పించడంతో నాని స్టార్ హీరోగా ఇండస్ట్రీలో వెలుగొందుతున్నాడు…

ఇక శర్వానంద్( Sharwanand ) కూడా వరుసగా సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నాడు.ప్రస్తుతం ఉన్న హీరోల్లో వీళ్లు ముగ్గురు హీరోలు అందరికంటే ముందు వరుసలో దూసుకుపోతున్నారు…ఇక వీళ్ళు కనక ఇలానే సక్సెస్ తో ముందుకెళ్తే పెద్ద హీరోలు అవ్వడం పక్క
.







