వింటర్ సీజన్ లో ఈ సింపుల్ చిట్కాను పాటిస్తే మీ స్కిన్ సూపర్ స్మూత్ అండ్ షైనీ గా మెరవడం ఖాయం!

ప్రస్తుత ఈ వింటర్ సీజన్ లో చాలా మంది ముఖ చర్మం డ్రై గా, డల్ గా తయారవుతుంది.దీంతో ఏమాత్రం ఎట్రాక్టివ్ గా కనిపించ‌లేరు.

 Follow This Home Remedy For Smooth And Shiny Skin! Home Remedy, Smooth Skin, Shi-TeluguStop.com

ఇటువంటి స్కిన్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలియక హైరానా పడిపోతుంటారు.మీరు ఈ లిస్టులో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే సింపుల్ చిట్కాను అస్సలు మిస్ అవ్వకండి.వింటర్ సీజన్ లో ఈ చిట్కాను పాటిస్తే మీ స్కిన్ సూపర్ స్మూత్ అండ్ షైనీ గా మెరవడం ఖాయం.

మ‌రి ఇంకెందుకు ఆలస్యం ఆ చిట్కా ఏంటో తెలుసుకుందాం పదండి.

ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు కొబ్బరి ముక్కలు( Coconut ) వేసి మెత్తగా గ్రైండ్ చేసి పాలను సపరేట్ చేసుకోవాలి.ఆ త‌ర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఓట్స్( Oats ) మరియు అరకప్పు హోమ్ మేడ్ కొబ్బరి పాలు వేసి అరగంట పాటు నానబెట్టుకోవాలి.ఆ తర్వాత నానబెట్టుకున్న ఓట్స్ ను కొబ్బరి పాలతో సహా మిక్సీ జార్ లో వేసి స్మూత్ గా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ తేనె వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

ఈ మిశ్రమాన్ని ముఖంతో పాటు మెడకు, చేతులకు కూడా అప్లై చేసుకునే ఇర‌వై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆ తర్వాత చేతివేళ్లతో సున్నితంగా చర్మాన్ని రబ్ చేస్తూ వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.రెండు రోజులకు ఒక‌సారి ఈ సింపుల్ చిట్కాను కనుక పాటిస్తే మీ చర్మం చాలా స్మూత్ గా మారుతుంది.

షైనీ గా మెరుస్తుంది.డ్రై స్కిన్( Dry skin ) అన్న మాట అనరు.

కొబ్బరి పాలు చర్మాన్ని హైడ్రేటెడ్ గా, ఆరోగ్యంగా మారుస్తుంది.వింటర్ లో డ్రై అండ్ డల్ స్కిన్ కు దూరంగా ఉండటానికి ఈ చిట్కా అద్భుతంగా హెల్ప్ చేస్తుంది.

కాబట్టి తప్పక ట్రై చేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube