దసరా వంటి మాస్ యాక్షన్ బ్లాక్ బస్టర్ తర్వాత నాని ( Nani ) లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.నాని ప్రస్తుతం ”హాయ్ నాన్న”( Hi Nana ) సినిమాను చేయగా మరో 10 రోజుల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.
ఈ సినిమా నుండి టైటిల్ గ్లింప్స్ ను రిలీజ్ చేసినప్పుడే అంచనాలు పెరిగిపోయాయి.ఇక రిలీజ్ డేట్ దగ్గర పడే కొద్దీ డిఫరెంట్ గా ప్రమోషన్స్ చేస్తూ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు పెట్టుకునేలా చేసారు.
ఈ సినిమా నుండి వచ్చిన టీజర్, సాంగ్స్ ఆడియెన్స్ ను బాగా అలరించాయి.ఇక తాజాగా నిన్న ట్రైలర్ ను రిలీజ్ చేసి ఇప్పటి వరకు ఉన్న అంచనాలను డబల్ చేసేసారు.

నిన్న సాయంత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా చేయగా ట్రైలర్ ను రిలీజ్ చేసారు.ఈ ట్రైలర్ చూసిన తర్వాత ప్రతీ ఆడియెన్ కూడా నాని అండ్ టీమ్ ఎందుకు ఈ సినిమాపై అంత క్లారిటీతో ఉన్నారు అనేది అర్ధం అవుతుంది.నాని ట్రైలర్ తోనే ఏడిపించేసాడు.ఇక సినిమా మొత్తం చూడడానికి ఫాన్స్ రెడీ అయ్యారు.

ఈసారి కూడా ఆడియెన్స్ మనసులను కదిలించే సినిమాతో నాని రాబోతున్నాడు అని అర్ధం అవుతుంది.చూడాలి మరి కెరీర్ లో బెంచ్ మార్క్ సినిమాతో నాని ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తాడో.కాగా ఈ సినిమాను శౌర్యన్ తెరకెక్కిస్తుండగా ఇందులో బేబీ కియారా ఖన్నా( Baby Kiara Khanna ) నాని కూతురు రోల్ పోషించింది.ఇక వైరా ఎంటెర్టైనమెంట్స్ బ్యానర్ పై మోహన్ చెరుకూరి ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించారు.
హేషమ్ అబ్దుల్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 7న రిలీజ్ కాబోతుంది.







