భారతీయ వివాహాలు గొప్ప వేడుకగా జరుగుతాయి.ఈ వెడ్డింగ్ సెలబ్రేషన్స్( Wedding Celebrations ) వధూవరులు, వారి కుటుంబాల కలయికను జరుపుకునే గొప్ప, విభిన్న సంప్రదాయాలకు ప్రసిద్ధి చెందాయి.
ఈ సంప్రదాయాలలో ఒకటి వరుడి ఊరేగింపు, ఈ సమయంలో వరుడు పూల మాలను( Garland ) ధరిస్తాడు.అయితే తాజాగా ఓ వరుడు మాత్రం అత్యంత ఖరీదైన డబ్బుదండను ధరించి అందరినీ షాక్ అయ్యేలా చేశాడు.అతడు ఏకంగా రూ.20 లక్షలు విలువైన కరెన్సీ నోట్లోనూ ఒక పూలమాలగా తయారు చేసి దాన్ని ధరించాడు.దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
@dilshadkhan_kureshipur అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ పోస్ట్ చేసిన ఈ వీడియోలో వరుడు కరెన్సీ నోట్ల దండ( Currency Notes Garland ) ధరించి ఒక ఇంటి పైకప్పుపై నిలబడి ఉన్నట్లు కనిపించింది.500 రూపాయల నోట్లను పూల ఆకారాల్లో మడతపెట్టి ఈ దండను తయారు చేశారు, దీని విలువ రూ.20 లక్షలు అని క్యాప్షన్‌లో ఉంది.ఈ వీడియోలో వరుడు ధరించిన డబ్బుదండ ఇంటి పైకప్పు నుంచి కిందకి చాలా దూరం వచ్చినట్లు చూడవచ్చు.అతని చుట్టూ అతిధులు కూడా కనిపించారు.

ఈ వీడియో చాలా మంది నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.ఈ డబ్బు నిజమా, నకిలీదా, వరుడు( Groom ) ఇంత పెద్ద మొత్తంలో నగదు ఎలా సంపాదించాడు అని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు.త్వరలో పెళ్లి పీటలపై ఆదాయపన్ను శాఖ దాడులు చేస్తుందని కూడా కొందరు జోక్ చేస్తున్నారు.

ఈ వీడియోకు ఇన్‌స్టాగ్రామ్‌లో 2 కోట్ల దాక వ్యూస్ వచ్చాయి.2,95,000 లైకులు వచ్చాయి.ఇది భారతీయ వివాహాలలో సంపద ప్రదర్శన, డబ్బు వృధా గురించి చర్చకు దారితీసింది.
కొంతమంది ఈ ఆడంబరాన్ని మెచ్చుకుంటే, మరికొందరు దుబారాను విమర్శిస్తారు.







