తమిళనాడును భారీ వర్షాలు ముంచెత్తాయి.ఈ క్రమంలో చెన్నై, తిరువళ్లూర్, చెంగల్పట్టు, కడలూరు సహా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.
మరోవైపు ఈరోడ్ జిల్లాలో కురిసిన భారీ వానతో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి.అటు పుదుచ్చేరిలోనూ ఎడతెరపి లేకుండా వాన పడుతోంది.
లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వర్షపు నీరు చేరడంతో జనజీవనం అస్తవ్యస్థం అయింది.రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి.
దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.అలాగే మరో రెండు రోజులపాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తం అయింది.
ఈ క్రమంలోనే అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేయాలని కీలక ఆదేశాలు జారీ చేసింది.







