ఇటీవల జరిగిన వరల్డ్ కప్(World Cup) ఫైనల్స్ లో ఆస్ట్రేలియా( Australia ) గెలవడంతో టీమిండియా( India ) ఓటమిని అంగీకరించాల్సి వచ్చింది.ఇలా పది మ్యాచ్లో గెలిచి ఫైనల్లో టీమిండియా ఓటమి పాలు కావడంతో ప్రతి ఒక్క భారతీయుడు ఎంతో ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ క్రమంలోనే మరికొందరు టీం ఇండియన్ క్రికెటర్ల పై ట్రోల్స్ కూడా చేయడం మొదలుపెట్టారు.అయితే ఇలా పది మ్యాచ్లో గెలిచినవారు ఒక్క మ్యాచ్లో ఓడిపోతే వారిని ట్రోల్ చేయాల్సిన పని ఏమాత్రం లేదంటూ పలువురు సినీ సెలబ్రిటీలు కౌంటర్ ఇవ్వడమే కాకుండా టీమ్ ఇండియాకు సపోర్ట్ చేస్తూ ట్వీట్లు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే సినీ నటి, రాజకీయ నాయకురాలు విజయశాంతి(Vijaya Shanthi) కూడా వరల్డ్ కప్ మ్యాచ్ గురించి స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది ఈ సందర్భంగా ఈమె స్పందిస్తూ… లీగ్ గేమ్స్, సెమీస్ లో ఇండియా ఎంతో అవలీలగా గెలిచింది.ఇలా పది మ్యాచ్ల విజయం తర్వాత ఒక వైఫల్యం ప్రతి ఒక్కరికి బాధ కలిగించే విషయమే.ఇలాంటి క్రమంలోనే భారత్ క్రికెటర్లను( Indian Cricketers ) ట్రోల్ చేయడం సరైన పద్ధతి కాదు అంటూ ఈమె తెలియజేశారు.
నిజానికి పది మ్యాచ్లు గెలిచి ఫైనల్స్ కి వచ్చిన భారత్ ముందు ఆస్ట్రేలియా ఎన్ని మ్యాచ్లు గెలిచింది? అయితే మిగతా కొన్ని క్రీడల పోటీల మాదిరిగానే క్రికెట్లో కూడా వరల్డ్ కప్ ఫైనల్స్ లో బెస్ట్ ఆఫ్ త్రీ( Best Of Three ) అనే విధానం కనుక ఉంటే ఫలితం మరోలా ఉండేదని అప్పుడే నిజమైన ప్రతిభ ఎవరిది అనేది ప్రజలకు కూడా తెలుస్తుంది అంటూ ఈ సందర్భంగా విజయశాంతి వరల్డ్ కప్ మ్యాచ్ గురించి మాట్లాడుతూ ఈ సందర్భంగా చేసినటువంటి ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక ఈమె ప్రస్తుతం పలు సినిమాలలో నటిస్తూనే మరోవైపు రాజకీయాలలో కూడా కొనసాగుతున్నారు.ఇన్ని రోజులు బిజెపి పార్టీలో ఉన్నటువంటి విజయశాంతి తాజాగా ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ గూటికి చేరారు.