మహబూబ్ నగర్ లో బీజేపీ నేత బండి సంజయ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ క్రమంలో బీఆర్ఎస్ పై తీవ్రంగా విమర్శలు చేశారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను బీఆర్ఎస్ అమలు చేయలేదని బండి సంజయ్ ఆరోపించారు.అర్హులకు పథకాలు ఇవ్వడం లేదన్న ఆయన నిరుద్యోగులను కేసీఆర్ మోసం చేశారని మండిపడ్డారు.
ఎన్నికల్లో డబ్బుతో గెలవాలని చూస్తున్నారని పేర్కొన్నారు.కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపిస్తే మళ్లీ బీఆర్ఎస్ లోకి వెళ్తారని ఎద్దేవా చేశారు.రాష్ట్రంలో ప్రతి ఒక్కరిపై రూ.1.20 లక్షల అప్పు పెట్టారని విమర్శించారు.