రాగి పంట ( Ragi Cultivation )విస్తీర్ణం ప్రతి ఏడాది పెరుగుతూ పోతోంది.రాగి లో ఎన్నో పోషకాలు ఉండడంవల్ల మార్కెట్లో ఈ పంటకు ఎప్పుడు మంచి డిమాండే ఉంటుంది.
పైగా ఈ పంట సాగుకు నీటి అవసరం చాలా తక్కువ.కాబట్టి నీటి వసతి తక్కువగా ఉండే నేలలలో రాగి పంటను సాగు చేసి, కొన్ని సరైన యాజమాన్య పద్ధతులు పాటించి మంచి ఆదాయం పొందవచ్చు.
ఈ రాగి పంటను వర్షాధారంగా లేదంటే ఆరుతడి పంటగా సాగు చేయవచ్చు.ఎలాంటి నేలలోనైనా ఈ పంట సాగు చేయవచ్చు.
కాకపోతే రాగి పంటను ఆశించే తెగుళ్ల విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి.అవి ఏమిటో తెలుసుకుందాం.

రాగి పంటను ఆశించి తీవ్రంగా నష్టం కలిగించే తెగుళ్లలో అగ్గి తెగులు కీలక పాత్ర పోషిస్తాయి.ఈ తెగుళ్లను సకాలంలో గుర్తించి వెంటనే నివారించాలి.లేత మొక్కలు మాడిపోయినట్లు కనిపిస్తే ఆ మొక్కకు అగ్గి తెగుళ్లు సోకినట్టే.అదే ముదిరిన మొక్కల ఆకులపై ఎరుపు, గోధుమ రంగు మచ్చలు ఏర్పడి మధ్యలో బూడిద రంగు మచ్చ ఉంటే ఆ మొక్కలకు అగ్గి తెగుళ్లు సోకినట్టే.
ఈ తెగుళ్లు( Pests ) సోకితే మొక్క కణుపు దగ్గర విరిగిపోతుంది.రాగి గింజలన్నీ తాలుగింజలుగా మారుతాయి.దిగుబడి సగానికి పైగా తగ్గే అవకాశం ఉంది.

ఈ అగ్గి తెగుళ్లు సోకిన తర్వాత నివారణ చర్యలు చేపట్టడం కంటే.రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి.ఒక కిలో రాగి విత్తనాలకు 3గ్రాముల థైరామ్ తో విత్తన శుద్ధి చేయాలి.
మొక్కలపై ఈ తెగుళ్ల లక్షణాలు కనిపిస్తే ఒక లీటరు నీటిలో 1గ్రామ్ కార్బండిజంను కలిపి మొక్కలు పూర్తిగా తడిచేటట్లు పిచికారి చేయాలి.పంటను ఎప్పటికప్పుడు గమనిస్తూ, ఏవైనా చీడపీడలు, తెగుళ్లు ఆశిస్తే తొలి దశలోనే నివారణ చర్యలు చేపట్టడం వల్ల అధిక దిగుబడి సాధించవచ్చు.







