వరల్డ్ కప్ లో ఏ జట్టు ఎన్నిసార్లు ఫైనల్ చేరిందంటే.. !

భారత్ వేదికగా అక్టోబర్ ఐదు న ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన ప్రపంచ కప్ టోర్నీ( World Cup ) చివరి దశకు చేరుకుంది.నవంబర్ 19వ తేదీ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా( India vs Australia ) ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

 How Many Times A Team Has Reached The Final In The World Cup Details, World Cup,-TeluguStop.com

సొంత గడ్డపై జరిగే టోర్నీ టైటిల్ కైవసం చేసుకోవాలని భారత్ గట్టి పట్టుదలతో ఉంది.ఈ టోర్నీలో ఆడిన ప్రతి మ్యాచ్ లో భారత్ వరుస విజయాలను ఖాతాలో వేసుకుంది.

ఫైనల్ మ్యాచ్ లో కూడా గెలిచి టైటిల్ సొంతం చేసుకోవాలని భావిస్తోంది.

ప్రపంచ కప్ చరిత్రలో ఏ జట్టు ఎక్కువసార్లు ఫైనల్ కు వెళ్ళింది.

ఏ జట్టు ఎక్కువసార్లు ఫైనల్ టైటిల్( World Cup Final ) గెలిచింది.అనే వివరాలతో పాటు టోర్నీలో పాల్గొనే జట్లు ఎన్నిసార్లు ఫైనల్ కు చేరాయో చూద్దాం.

ప్రపంచ కప్ చరిత్రలో ఆస్ట్రేలియా జట్టు( Australia ) అత్యధిక సార్లు ఫైనల్ చేరిన జట్టుగా నిలిచింది.ఇప్పటివరకు ఆస్ట్రేలియా ఎనిమిది సార్లు ప్రపంచ కప్ ఫైనల్ చేరింది.

ఐదు సార్లు వన్డే వరల్డ్ కప్ టైటిల్ విజేతగా నిలిచింది.

Telugu Australia, England, Final, Icc Odi Cup, India, India Australia, Zealand,

ఆస్ట్రేలియా తర్వాత ఎక్కువసార్లు ఫైనల్ చేరిన జట్లు ఏవంటే.భారత్,( India ) ఇంగ్లాండ్.( England ) ఈ రెండు జట్లు చేరో నాలుగు సార్లు ఫైనల్ కు చేరాయి.

ఆ తర్వాత వెస్టిండీస్, శ్రీలంక జట్లు చేరో మూడుసార్లు ఫైనల్ కు చేరాయి.పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లు చేరో రెండుసార్లు వరల్డ్ కప్ ఫైనల్ కు చేరాయి.

Telugu Australia, England, Final, Icc Odi Cup, India, India Australia, Zealand,

ప్రపంచ కప్ 2023 టోర్నీలో విజేతగా నిలిచి అత్యధిక సార్లు ప్రపంచ కప్ టైటిల్ గెలిచిన జట్టుగా నిలవాలని ఆస్ట్రేలియా భావిస్తోంది.సొంత గడ్డపై జరిగిన టోర్నీలో ఓటమి అనేది ఎరుగకుండా వరుస విజయాలతో ముందుకు దూసుకుపోతున్న జట్టు ఈ టోర్నీ విజేతగా నిలవాలని భావిస్తోంది.అయితే భారత జట్టు ఫామ్ చూస్తుంటే.కచ్చితంగా భారత్ ఫైనల్ గెలిచి టైటిల్ కైవసం చేసుకుంటుందని క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube