వరల్డ్ కప్ లో ఏ జట్టు ఎన్నిసార్లు ఫైనల్ చేరిందంటే.. !

భారత్ వేదికగా అక్టోబర్ ఐదు న ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన ప్రపంచ కప్ టోర్నీ( World Cup ) చివరి దశకు చేరుకుంది.

నవంబర్ 19వ తేదీ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా( India Vs Australia ) ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

సొంత గడ్డపై జరిగే టోర్నీ టైటిల్ కైవసం చేసుకోవాలని భారత్ గట్టి పట్టుదలతో ఉంది.

ఈ టోర్నీలో ఆడిన ప్రతి మ్యాచ్ లో భారత్ వరుస విజయాలను ఖాతాలో వేసుకుంది.

ఫైనల్ మ్యాచ్ లో కూడా గెలిచి టైటిల్ సొంతం చేసుకోవాలని భావిస్తోంది.ప్రపంచ కప్ చరిత్రలో ఏ జట్టు ఎక్కువసార్లు ఫైనల్ కు వెళ్ళింది.

ఏ జట్టు ఎక్కువసార్లు ఫైనల్ టైటిల్( World Cup Final ) గెలిచింది.

అనే వివరాలతో పాటు టోర్నీలో పాల్గొనే జట్లు ఎన్నిసార్లు ఫైనల్ కు చేరాయో చూద్దాం.

ప్రపంచ కప్ చరిత్రలో ఆస్ట్రేలియా జట్టు( Australia ) అత్యధిక సార్లు ఫైనల్ చేరిన జట్టుగా నిలిచింది.

ఇప్పటివరకు ఆస్ట్రేలియా ఎనిమిది సార్లు ప్రపంచ కప్ ఫైనల్ చేరింది.ఐదు సార్లు వన్డే వరల్డ్ కప్ టైటిల్ విజేతగా నిలిచింది.

"""/" / ఆస్ట్రేలియా తర్వాత ఎక్కువసార్లు ఫైనల్ చేరిన జట్లు ఏవంటే.భారత్,( India ) ఇంగ్లాండ్.

( England ) ఈ రెండు జట్లు చేరో నాలుగు సార్లు ఫైనల్ కు చేరాయి.

ఆ తర్వాత వెస్టిండీస్, శ్రీలంక జట్లు చేరో మూడుసార్లు ఫైనల్ కు చేరాయి.

పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లు చేరో రెండుసార్లు వరల్డ్ కప్ ఫైనల్ కు చేరాయి.

"""/" / ఈ ప్రపంచ కప్ 2023 టోర్నీలో విజేతగా నిలిచి అత్యధిక సార్లు ప్రపంచ కప్ టైటిల్ గెలిచిన జట్టుగా నిలవాలని ఆస్ట్రేలియా భావిస్తోంది.

సొంత గడ్డపై జరిగిన టోర్నీలో ఓటమి అనేది ఎరుగకుండా వరుస విజయాలతో ముందుకు దూసుకుపోతున్న జట్టు ఈ టోర్నీ విజేతగా నిలవాలని భావిస్తోంది.

అయితే భారత జట్టు ఫామ్ చూస్తుంటే.కచ్చితంగా భారత్ ఫైనల్ గెలిచి టైటిల్ కైవసం చేసుకుంటుందని క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు.

ఈ పవర్ ఫుల్ రెమెడీతో పసుపు దంతాలకు చెప్పండి గుడ్ బై..!