అక్కినేని ని వెక్కిరించిన వారిచే విజిల్స్ వేయించాడు. వేలకొద్దీ కళ్లద్దాలు కూడా కొనిపించాడు

నటనకు డిక్షనరీ అని ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం అక్కినేని నాగేశ్వరరావు ( Akkineni nageswararao )మాత్రమే అతడు నటించని పాత్రలు లేవు జీవించని వేషం లేదు.జానపదాలకు, పౌరాణికాలకు అతడు పెట్టింది పేరు అతని సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది కూడా ద్వారానే అందుకే అక్కినేని అంటే కేవలం జానపదం లేదా పౌరాణికం అని మాత్రమే అందరూ అనుకునేవారు అప్పట్లో.

 How Akkineni Turns Him As Social Hero, Akkineni Nageswararao, Samsaram Movi-TeluguStop.com

అయితే అలాంటి ఒక టైం లోనే అతడు సోషల్ సినిమాలకు పనికిరాడు అని అందరూ అవహేళన చేసేవారు ఆ వెక్కిరింపుల నుంచి బయటపడాలి అంటే మంచి సోషల్ సినిమా తీయాలని నిర్ణయానికి వచ్చారు అక్కినేని ఆ టైంలోనే ఎల్ వి ప్రసాద్ సంసారం అనే ఒక సాంఘిక చిత్రాన్ని తీయాలని నిర్ణయించుకొని అందులో అక్కినేని హీరోగా పెట్టుకోవాలనుకున్నారు కానీ అతడు హీరో ఏంటి పైగా సాంఘిక చిత్రంలో అక్కినేని హీరోగా తీసుకుంటావా అంటూ ఎల్వి ప్రసాద్ ని అందరూ వార్న్ చేశారట.

Telugu Akkineni, Vprasad, Manam, Samsaram, Tollywood-Movie

కానీ అందరి మాటలకు ఏమాత్రం ప్రభావితం కానీ ఎల్.వి.ప్రసాద్( L.V.Prasad ) అక్కినేని నీ సోషల్ ఎలిమెంట్ ఉన్న హీరోగా తీసుకున్నారు.మద్రాసులోని మౌంట్ రోడ్ లో కల నిజమాయగా అనే పాటలో ఎంతో గ్లామర్ గా అక్కినేని కనిపించాల్సి ఉండగా అందుకోసం తనని తాను మేకోవర్ కూడా చేసుకున్నాడు అక్కినేని.ఆర్టికల్స్ కంపెనీకి వెళ్లి అప్పటివరకు అందరూ హీరోలు వాడినట్టు గుండ్రటి కళ్లద్దాలు కాకుండా అందుకు భిన్నంగా తన కళ్ళకు సరిపోయి ముఖగవళికలకు బాగా నొప్పిగా భిన్నమైన అద్దాలను సెలెక్ట్ చేసుకున్నారట.

దాంతో అతడు స్టైల్ గా కళ్లద్దాలు పెట్టుకున్న తీరును చూసి యావత్ తెలుగు ప్రజానీకం వేలకొద్దీ అలాంటి కళ్ళజోళ్ళనే కొనుగోలు చేశారు అలాంటి చరిత్ర అక్కినేని ఉంది. సంసారం సినిమాలో ( Samsaram movie )మయో ఆర్టికల్స్ కళ్ళజోళ్లను అక్కినేని వాడారని ఆ సినిమా విడుదలైన వెంటనే దాదాపు 5వేలకు పైగా ఆ రకం కళ్లద్దాలు అమ్ముడుపోయాయని ఆ కంపనీ ప్రకటించింది.

దాంతో అక్కినేని కి సదరు కంపెనీ వారు కృతజ్ఞతలు చెప్పారట.

Telugu Akkineni, Vprasad, Manam, Samsaram, Tollywood-Movie

అలా ఎవరైతే అప్పటివరకు తనపై అవహేళనగా కామెంట్స్ చేశారో వాళ్లే శభాష్ అంటూ మెచ్చుకునేలా చేశాడు.అదే ప్రకృతి తనకేం కావాలో తనకు ఏ విధంగా ఉండాలో తన్ను తాను మలుచుకుంటూ వెళుతుంది అని చెప్పడానికి అక్కినేని ఒక ఉదాహరణ

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube