తెలంగాణలో నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగిసింది.ఈ క్రమంలోనే రెబల్ అభ్యర్థులను బుజ్జగించడంలో హస్తం పార్టీ సక్సెస్ సాధించింది.
బుజ్జగింపులు సక్సెస్ కావడంతో పలువురు అభ్యర్థులు తమ తమ నామినేషన్లను విత్ డ్రా చేసుకున్నారు.బరిలో నుంచి తప్పుకున్న నేతలకు తరువాత పార్టీలో సముచిత స్థానాలు కల్పిస్తామని కాంగ్రెస్ అగ్రనేతలు హామీ ఇవ్వడంతో రెబల్ అభ్యర్థులను వెనక్కి తగ్గారని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే డీసీసీ అధ్యక్ష పదవులు, ఎంపీ టికెట్లు ఇస్తామని పార్టీ అధిష్టానం హామీ ఇవ్వడంతో పలువురు నేతలు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు.వీరిలో సూర్యాపేట నుంచి రెబల్ అభ్యర్థిగా ఉన్న పటేల్ రమేశ్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇస్తామని రాతపూర్వక హామీ ఇవ్వడంతో ఆయన నామినేషన్ విత్ డ్రా చేసుకున్నారు.
అలాగే బాన్సువాడలో కాసుల బాలరాజు, జుక్కల్ లో గంగారాం, వరంగల్ వెస్ట్ లో జంగా రాఘవ రెడ్డి మరియు డోర్నకల్ లో నెహ్రు నాయక్ నామినేషన్లను విత్ డ్రా చేసుకున్నారు.







