ప్రస్తుత కాలంలో మొక్కలు పెంచేందుకు స్థలం అవసరం లేదు.ఇళ్లల్లో మొక్కలను పెంచుకునే సరికొత్త పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి.
ఇళ్లల్లో అంటే చిన్న చిన్న కుండీలలో మొక్కలను నాటి పెంచడం అని అనుకుంటే అది పొరపాటే.మొక్కలను( Plants ) తలకిందులుగా పెంచే పద్ధతులు ప్రస్తుతం అందుబాటులోకి వచ్చాయి.
ఇంటి ఆవరణలో మొక్కలు పెంచేందుకు స్థలాన్ని కేటాయించాల్సిన అవసరం ఇకపై ఉండదు.

చెర్రీ టమోటా ( Cherry tomato )లాంటి రకాలను తలకిందులుగా పెంచవచ్చు.ఇందుకోసం వేలాడదీయగల బకెట్ లేదా కుండిని తీసుకొని, దానికి అడుగు భాగంలో ఒక రంధ్రం చేయాలి.ఆ బకెట్లో ఒక కుండీ ఉంచి అందులో మట్టితో పాటు మంచి ఎరువును వేసి అందులో టమాటా విత్తనాలు నాటుకోవాలి.
ఈ విత్తనాలు మొలకెత్తిన తర్వాత.కుండీ పైభాగం కవర్ అయ్యేలా మూత వంటి వాటిని ఏర్పాటు చేసి తలకిందులుగా వేలాడదీసి ఆ రంధ్రంలో ఈ మొలకెత్తిన మొక్కను చొప్పించాలి.
ఈ బకెట్ ను సూర్యరశ్మి తగిలే చోట వేలాడదీయాలి.

టమాటా మొక్క ఆరోగ్యంగా పెరగడం కోసం తీగల వంటి సపోర్ట్ ఏర్పాటు చేయాలి.ఇప్పుడు మొక్కలు చక్కగా గాలికి ఎక్స్ పోజ్ అయి ఆరోగ్యకరంగా పెరుగుతాయి.పైగా పరాగ సంపర్కం సులభం అవుతుంది.
ఇలా వేలాడదీసే పద్ధతిలో మొక్కలను సాగు చేస్తే చీడపీడల బెడద, తెగుళ్ల( Pests ) బెడద ఉండదు.తలకిందులుగా వేలాడదీయడం వల్ల మొక్కలు ఎలా పడితే అలా వ్యాపించవు కాబట్టి చక్కగా నచ్చిన రీతిలో కట్ చేసుకుని ఆకర్షణీయకంగా పెంచుకోవచ్చు.
వీటిని ఒక చోట నుండి మరొక చోటికి కూడా సులభంగా తరలించవచ్చు.ఇంటి ముందు, బాల్కనీలో ఎక్కడ సూర్యరశ్మి సంపూర్ణంగా ఉంటుందో అటువంటి ప్రదేశాలలో వేలాడదీసే పద్ధతి( Hanging method ) ద్వారా టమాటా మొక్కలను పెంచి, నాణ్యమైన టమాటా పండ్లను పొందవచ్చు.







