బిగ్ బాస్ ( Bigg Boss )కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో శ్వేత వర్మ ( Swetha Varma ) ఒకరు.ఈమె బిగ్ బాస్ సీజన్ సిక్స్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొని సందడి చేశారు.
బిగ్ బాస్ కార్యక్రమానికి శ్వేతావర్మ రాకముందు ఈమె పలు చిన్న చిన్న సినిమాలలో హీరోయిన్గా నటించిన సందడి చేశారు.ప్రస్తుతం ఈమె పలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ హీరోయిన్గా సందడి చేస్తున్నారు.
ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి శ్వేతా వర్మ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.
ఈ క్రమంలోనే ఈమె సోషల్ మీడియాలో తాజాగా షేర్ చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.ఇందులో భాగంగా ఈమె తన ఇంట్లో పెద్ద ఎత్తున అగ్నిప్రమాదం (Fire Accident ) చోటు చేసుకుంది అంటూ చెప్పుకొచ్చారు.తన ఇంట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం చోటుచేసుకుందని ఈ ప్రమాదం కారణంతో ఒక రూమ్ మొత్తం పూర్తిగా కాలిపోయిందని శ్వేతా వర్మ తెలియజేశారు.
అయితే ఈ ప్రమాదంలో తమ ఫ్యామిలీ మెంబర్స్ కి అలాగే తన పెట్స్ కి ఎలాంటి ప్రమాదం జరగలేదని ఈమె చెప్పుకు వచ్చారు.
ఇలా మేమంతా సేఫ్ గా ఉన్నామని అయితే ఈ భయంకరమైనటువంటి ఘటన నుంచి తేలుకోవడానికి నాకు కాస్త సమయం పడుతుందని అప్పటివరకు సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నానని మాకోసం ప్రతి ఒక్కరు ప్రార్థించండి అంటూ ఈ సందర్భంగా శ్వేతా వర్మ తన ఇంట్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదం గురించి చెబుతూ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసినటువంటి ఈ పోస్ట్ వైరల్ గా మారింది.అయితే ఇది చూసినటువంటి అభిమానులు జాగ్రత్తగా ఉండండి అంటూ ఈమెకు కామెంట్లు చేస్తున్నారు.