ఈ నెల తెలంగాణ లో జరగబొయ్యే అసెంబ్లీ ఎన్నికలలో పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )జనసేన పార్టీ కూడా పోటీ చెయ్యబోతున్న సంగతి మన అందరికీ తెలిసిందే.ముందుగా 32 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్దమైన జనసేన పార్టీ ( Janasena party )ని బీజేపీ పార్టీ పార్టీ రాష్ట్ర అద్యక్ష్యుడు కిషన్ రెడ్డి ( Kishan Reddy )పవన్ కళ్యాణ్ తో చర్చలు జరిపి, పొత్తు కుదురించుకున్న సంగతి తెలిసిందే.
ఇప్పుడు జనసేన పార్టీ పొత్తులో భాగంగా 11 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు సిద్దపడింది.అందులో కూకట్ పల్లి లాంటి ప్రాంతం కూడా ఉంది , ఇక్కడ జనసేన పార్టీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఇదంతా పక్కన పెడితే నేడు హైదరాబాద్ లోని జనసేన పార్టీ కార్యాలయం లో కొంతమంది ప్రముఖులు పవన్ కళ్యాణ్ సమక్షం లో జనసేన పార్టీ లో చేరారు.వారిలో మొగలిరేకులు సీరియల్ హీరో సాగర్ కూడా ఉన్నాడు.

గత కొద్ది రోజుల క్రితం సాగర్( Sagar ) పవన్ కళ్యాణ్ ని కలిసి చాలాసేపటి వరకు చర్చలు జరిపాడు.అనంతరం ఆయన పవన్ కళ్యాణ్ తో పంచుకున్న మధుర క్షణాల గురించి చెప్పుకుంటూ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో ఒక ఫోటో ని షేర్ చేసాడు.ఎదో ఫార్మాలిటీ గా పవన్ కళ్యాణ్ ని కలిసాడని అందరూ అనుకున్నారు కానీ, ఇలా జనసేన పార్టీ లో సాగర్ చేరుతాడని ఎవ్వరూ అనుకోలేదు.కేవలం చేరడం మాత్రమే కాదు, ఆయన స్వస్థలమైన రామగుండం( Ramagundam ) నుండి జనసేన పార్టీ తరుపున పోటీ కూడా చెయ్యబోతున్నాడు అట.గెలుపు కూటములకు అతీతంగా పార్టీ కోసం పని చేస్తానని, తుది శ్వాస వరకు జనసేన పార్టీ తోనే నా ప్రయాణం అంటూ సాగర్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా సాగర్ ఎంట్రీ పై సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సాగర్ నటించిన ‘మొగలి రేకులు’( Mogali Rekulu ) సీరియల్ పెద్ద బ్లాక్ బస్టర్ హిట్.ఇప్పటికీ కూడా ఈ సీరియల్ ని యూట్యూబ్ లో చూస్తుంటారు ఆడియన్స్.అందులో ఆయన పోషించిన ఆర్కే నాయుడు మరియు మున్నా పాత్రలు ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా గుర్తుండిపోతాయి.పోలీస్ అంటే ఇలాగే ఉండాలి అని ఆర్కే నాయుడు పాత్ర ని చూసిన ప్రతీ ఒక్కరికి అనిపిస్తాది.
ఈ పాత్ర ద్వారా ఆయన ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు.పలు సినిమాల్లో హీరో గా కూడా నటించిన సాగర్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు కి బాగా కావాల్సిన వ్యక్తి.
దిల్ రాజు నిర్మించిన ‘షాదీ ముబారక్’ అనే చిత్రం లో సాగర్ హీరో గా కూడా నటించాడు.అలా ప్రేక్షకులను అలరించిన సాగర్, రాజకీయ నాయకుడిగా ఎలా ఎదగబోతున్నాడో చూడాలి.







