రాజన్న సిరిసిల్ల ఇల్లంతకుంట మండలం( Ellantakunta )లోని పెద్దలింగాపూర్ గ్రామానికి చెందిన కొడుముంజ రవిందర్ ను స్థానిక సర్పంచ్ గొడిశెల జితెందర్ గౌడ్ కండువ కప్పి బిఆర్ఎస్ పార్టీ లోకి ఆహ్వానించినారు.ఆయన తో పాటు కాంగ్రేస్ పార్టీకి చెందిన అరుకాల రవిందర్ రెడ్డి( Arukala Ravinder Reddy ) బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది.
అనంతరం రవిందర్ మాట్లాడుతూ కొంత సమయ పాలన వలన గ్యాబ్ ఏర్పడిందని,అందుకే పార్టీ మారడం జరిగిందని,ఆ పార్టీలో ఇమిడలేనని మరల తిరిగి సొంత గూటికి గురువారం రోజున రావడం జరిగిందని అన్నారు.
సొంత గూటికి రావడం చాలా ఆనందంగా ఉందని ,తెలంగాణ రాష్ట) సాంస్కృతిక సారథి చైర్మేన్, మానకొండూర్ శాసన సభ్యులు డాక్టర్ రసమయి బాలకిషన్ ( Rasamayi Balakishan ) గెలుపు కొరకు కృషి చేస్తానని అన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ గొడిశెల జితెందర్ గౌడ్,మాజీ సర్పంచ్ మాతిరెడ్డి కిషన్ రెడ్డి,నాయకులు మీసరగండ్ల అనిల్ కుమార్,కేతిరెడ్డి సుధాకర్ రెడ్డి,ల్యాగల బాగయ్య ఎలవేణి రమేశ్ తదితరులు పాల్గొన్నారు.