భారత జట్టు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ( Virat Kohli ) ఇప్పటివరకు వన్డేలలో 48 సెంచరీలు చేశాడు.కోహ్లీ మరో సెంచరీ చేస్తే సచిన్ టెండుల్కర్ రికార్డ్ సమం అవుతుంది.
ఇటీవలే న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్లో కేవలం ఐదు పరుగుల తేడాతో కోహ్లీ సెంచరీ మిస్ చేసుకున్నాడు.ఇక ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో పరుగులు చేయకుండా డక్ అవుట్ అయిన సంగతి తెలిసిందే.
నవంబర్ 2న వాఖండే వేదికగా భారత్-శ్రీలంక మధ్య మ్యాచ్ జరగనుంది.ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ 49వ సెంచరీ కల తీరుతుందని అభిమానులు ఆశపడుతున్నారు.
శ్రీలంకపై కచ్చితంగా విరాట్ కోహ్లీ సెంచరీ చేసే అవకాశం ఉంది.విరాట్ కోహ్లీ ఇప్పటివరకు వన్డేల్లో చేసిన 48 సెంచరీలలో అత్యధికంగా 10 సెంచరీలు శ్రీలంక పైనే చేయడం గమనార్హం.

క్రికెట్ అభిమానులంతా సోషల్ మీడియా వేదికగా విరాట్ కోహ్లీ కచ్చితంగా సెంచరీ చేస్తాడని చేస్తున్న ట్విట్స్ వైరల్ అవుతున్నాయి.వన్డేల్లో 49 సెంచరీలు చేసిన సచిన్ టెండూల్కర్ ఫస్ట్ ప్లేస్ లో ఉండగా.కోహ్లీ 48 సెంచరీలతో రెండవ స్థానంలో ఉన్నాడు.శ్రీలంక తో జరిగే మ్యాచ్లో కోహ్లీ మరో సెంచరీ చేస్తే 49 సెంచరీలతో సచిన్ టెండూల్కర్( Sachin Tendulkar ) రికార్డ్ సమం అవుతుంది.
విరాట్ కోహ్లీ ఈ వన్డే వరల్డ్ కప్ టోర్నీలో ఆడిన ఆరు మ్యాచ్లలో ఒక సెంచరీ, 3 అర్థ సెంచరీలతో 354 పరుగులు చేశాడు.దీంతో భారత్ తరపున వన్డే వరల్డ్ కప్ 2023లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు.

భారత్-శ్రీలంక మధ్య జరిగే మ్యాచ్లో శ్రీలంక ఓడిపోతే సెమీ ఫైనల్ రేసు నుండి అఫీషియల్ గా నిష్క్రమించినట్లే.ఇక ఈ టోర్నీలో ఇప్పటివరకు ఓటమి ఎరగని భారత జట్టు శ్రీలంకపై గెలిచి నేరుగా సెమీస్ బెర్త్ ఖరారు చేసుకోవాలని అనుకుంటోంది.మొత్తానికి నవంబర్ రెండవ తేదీ జరిగే మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగే అవకాశం ఉంది.







