తమిళ్ సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందిన డైరెక్టర్ లలో లోకేష్ కనక రాజ్,( Lokesh Kanagaraj ) అట్లీ( Atlee ) ఇద్దరు కూడా తమదైన మార్క్ డైరెక్షన్ ని చూపిస్తూ ఇండస్ట్రీలో వాళ్లకంటు ఒక ప్రత్యేకత చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు.ఇక ఇలాంటి క్రమంలోనే వీళ్ళిద్దరూ చెరో 5 సినిమాలు చేశారు.
దాంట్లో ఇద్దరు ఒక్క ఫ్లాప్ కూడా చవిచూడకుండా మొత్తం హిట్ సినిమాలే చేయడం విశేషం అనే చెప్పాలి.తమిళ్ ఇండస్ట్రీలో( Kollywood ) వీళ్ళ సినిమాల మీద చాలా పెద్ద చర్చ నడుస్తుంది.
అయితే వీరిద్దరిలో ఎవరు టాప్ డైరెక్టర్ అనే విషయం మీద చాలా రోజులుగా మంచి చర్చలు అయితే నడుస్తున్నాయి దానికి తగ్గట్టుగానే చాలామంది ఇద్దరి పేర్లను ప్రస్తావిస్తున్నారు.

ఇక వీళ్ళిద్దరూ కూడా తమిళ ఇండస్ట్రీలో ఒకప్పుడు శంకర్ , మణిరత్నం ఎలాగైతే ప్లాప్ లు లేకుండా సినిమాలు చేసి టాప్ డైరక్టర్లు గా ఎదిగారో వీళ్ళు కూడా అంతమంచి పొజిషన్ కి చేరుకుంటారు అంటూ చాలా మంది వీళ్ల గురించి గొప్పగా చెబుతున్నారు.ఇక లోకేష్ కనకరాజ్ తీసిన సినిమాల్లో ఖైదీ,( Khaidi ) విక్రమ్( Vikram ) లాంటి సినిమాలు మంచి విజయాలు సాధించాయి.అయితే అట్లీ తీసిన సినిమాల్లో రాజా రాణి, పోలీసోడు, అదిరింది, జవాన్ లాంటి సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి.

ప్రస్తుతం వీళ్ళిద్దరికీ తమిళం తో పాటు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది.ప్రస్తుతం వీళ్లిద్దరి మధ్య పోటీ అనేది తీవ్రతరమైంది.మరి ఈ ఇద్దరు డైరెక్టర్లలో ఎవరు టాప్ లో ఉన్నారు అనేది చెప్పడం కష్టమే కానీ ఇద్దరు డైరెక్టర్లు మాత్రం టాప్ లెవల్లో సినిమాలు చేస్తున్నారు…ఇక ప్రస్తుతం వీళ్లిద్దరూ కూడా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్నారు.వీళ్ళు తీసిన సినిమాలు కనక సక్సెస్ అయితే వీళ్ళు కూడా పాన్ ఇండియా రేంజ్ లో చాలా గొప్ప స్థాయి కి వెళ్తారు…
.







