తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ అని గుర్తు చేశారు.
నాయకుల కోసం కాదు ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ ఉందని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.వచ్చే ఎన్నికల్లో నల్గొండ జిల్లాలోని 12 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణ కోసం మంత్రి పదవి వదులుకున్నానన్న ఎంపీ కోమటిరెడ్డి కాంగ్రెస్ పార్టీతోనే తెలంగాణలో అభివృద్ధి సాధ్యమని వెల్లడించారు.ఈ నేపథ్యంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఎంపీ కోమటిరెడ్డి కోరారు.