స్టార్ మా ఛానల్ లో ప్రసారమైన ‘కార్తీక దీపం’( Karthikadeepam ) సీరియల్ లో మోనిత అనే నెగటివ్ క్యారక్టర్ తో శోభా శెట్టి కి( Sobha Shetty ) ఎంత మంచి క్రేజ్ వచ్చిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.ఈ క్యారక్టర్ ద్వారా వచ్చిన క్రేజ్ తో ఆమెకి బిగ్ బాస్ సీజన్ 7 లో( Bigg Boss 7 ) పాల్గొనే ఛాన్స్ దక్కింది.
సీజన్ ప్రారంభం నుండి టాస్కులు ఆడే విషయం లో మంచిగానే ఉంది కానీ, ఈమెకి ఉన్న యాటిట్యూడ్ వల్ల హౌస్ లో చాలా మంది ఇబ్బందికి గురి అవుతున్నారు.నామినేషన్స్ సమయం లో ఈమెని నామినేట్ చెయ్యాలంటే హౌస్ మేట్స్ భయపడిపోతున్నారు.
ఆ రేంజ్ తనని నామినేట్ చేసే వారిపై ఈమె విరుచుకుపడుతూ ఉంటుంది.ఇక నిన్న జరిగిన కెప్టెన్సీ టాస్కు( Captaincy Task ) చివరి రౌండ్ లో శోభా శెట్టి మరియు యావర్ మధ్య జరిగిన గొడవ ఎంతటి సెన్సేషన్ అయ్యిందో మనమంతా చూసాము.

అసలు విషయం లోకి వెళ్తే కెప్టెన్ ని ఎంచుకునే అవకాశం ని స్వయంగా హౌస్ మేట్స్ కి కల్పించాడు బిగ్ బాస్.అందులో భాగంగా ఎవరికి అయితే ఉన్న 5 మంది కంటెండర్స్ లో ఇంటికి కెప్టెన్ అయ్యే అర్హత లేదని భావిస్తారో వారి మెడలో మిర్చి దండ వెయ్యమని బిగ్ బాస్ చెప్తాడు.ఈ టాస్కులో యావర్( Yawar ) శోభా శెట్టి కి మిర్చి దండ వేసి కెప్టెన్సీ కంటెండర్ నుండి తొలగిస్తాడు.దీనికి శోభా శెట్టి కట్టలు తెంచుకున్న ఆగ్రహం తో యావర్ పై విరుచుకుపడుతుంది.
ఇద్దరి మధ్య కాసేపు వాడావేడి వాతావరణం నెలకొంటుంది.అలా మాటల యుద్ధం జరుగుతూ ఉన్న సమయం లో శోభా శెట్టి సహనం కోల్పోయి యావర్ ని పిచ్చోడు అని అరిచేస్తుంది.
దీనికి యావర్ పిచ్చోడినా నేను అంటూ శోభా శెట్టి మీదకు వెళ్తాడు.ఇద్దరి మధ్య కొట్లాట జరిగే వాతావరణం నెలకొంటుంది.

అప్పుడు హౌస్ మేట్స్ అందరూ వీళ్లిద్దరి మధ్య కొట్లాట జరగకుండా ఆపుతారు.ఈ హీట్ చర్చ జరగడానికి ప్రధాన కారణం శోభా శెట్టి. యావర్ చాలా కూల్ గా మాట్లాడుతున్న సమయం లో శోభా శెట్టి ఫైర్ అవుతుంది.అక్కడి నుండి వేరే లెవెల్ కి వెళ్ళిపోయింది.అందరూ శోభా శెట్టి ప్రవర్తన చూసి ఈమె రీల్ మీదనే కాదు, రియల్ లైఫ్ లో కూడా మోనిత( Monitha ) లాగానే ప్రవర్తిస్తుంది అని సోషల్ మీడియా లో కామెంట్ చేస్తున్నారు.అయితే ఆమె ముందుగా యావర్ మరియు రతికా ని కలిసి తనకి సపోర్టు చేయాల్సిందిగా కోరుతుంది.
ఆమె అలా కోరిన సమయం లో యావర్ కచ్చితంగా సహాయం చేస్తాను అని అంటాడు.కానీ అదే యావర్ వచ్చి మిర్చి దండ వేస్తాడు, అందుకే శోభా శెట్టి ఆ రేంజ్ లో ఫైర్ అయ్యిందని అంటున్నారు మరికొంతమంది.
ఈ వారం నామినేషన్స్ లో శోభా శెట్టి ఉంది, ఓటింగ్ ప్రకారం ఆమె ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వెళ్ళిపోబోతుంది అనే టాక్ ఉంది.







