కెసిఆర్ వల్లే పాలేరుకు మోక్షం వచ్చిందని ఒకప్పుడు మాట్లాడిన నాయకులే ఇప్పుడు నేను ద్రోహం చేశానంటున్నారని రాజకీయ అవసరాల కోసం ఉల్టా పల్టాగా మాట్లాడుతున్నారని, కానీ సత్యం ఎప్పుడూ ఒకటే ఉంటుందని అది ప్రజలకు తెలుసు అన్నారు కేసీఆర్.( CM KCR ) ఖమ్మం జిల్లా పాలేరు లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన తుమ్మల( Tummala Nageswara Rao ) వైఖరిని తూర్పురబట్టారు.
పువ్వాడ అజయ్ పై ఓడిపోయి మూలన కూర్చుంటే పాత స్నేహితుడే కదా అని పిలిచి ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవిని ఇస్తే ఇప్పుడు మోసం చేశానని అడ్డదిడ్డo మాటలు మాట్లాడుతున్నారని, కెసిఆర్ తుమ్మలకు ద్రోహం చేశారా? లేక తుమ్మల కేసీఆర్ కు ద్రోహం చేశారా ? ప్రజలే తేల్చాలని ఆయన వ్యాఖ్యానించారు.
మంత్రి ని చేసి ఖమ్మం పై( Khammam ) ఏకచత్రాధిపత్యం ఇస్తే ఖమ్మం కు మీరు చేసింది గుండు సున్నా అని భరాసా ఖమ్మం లో అన్నీ స్థానాలు ఓడిపోవడానికి కారణమయ్యారంటూ ఫైర్ అయ్యారు .ఇదంతా మీ కళ్ళ ముందు జరిగిన చరిత్ర, దీనిని ఎవరు వక్రీకరించలేరు అన్నారు.రైతుబంధు పథకానికి( Rythu Bandhu ) ఐక్యరాజసమితి నుంచి కూడా ప్రశంసలు దక్కాయని, స్వామినాధన్ లాంటి వ్యవసాయ శాస్త్రవేత్తలు సైతం ఈ పథకాన్ని మెచ్చుకున్నారని కాంగ్రెస్ ( Congress ) వస్తే ఈ పథకాలు ఏవి కొనసాగవని కాబట్టి రైతులు అత్యంత జాగ్రత్తగా ఓట్లు వెయ్యాలంటూ ఆయన పిలుపునిచ్చారు.
తండాలను పంచాయతీలుగా మార్చింది ఎవరో ప్రజలకు తెలుసని భక్త రామదాసు ప్రాజెక్టు కట్టకముందు ఇక్కడ భూములు ధర ఎంతో కట్టిన తర్వాతే పెరిగిన ధర ఎంతో ప్రజలు ఆలోచించుకొని ఇది ఏ పార్టీ పుణ్యమో యోచన చేసి ఓట్లు వేయాలంటూ ఆయన ప్రజలను కోరారు.పదవుల కోసం పుటకో పార్టీ మార్చే వారిని నమ్మొద్దని డబ్బు సంచులతో వచ్చే వారిని కాకుండా సర్వజనుల సంక్షేమం కోసం పనిచేసే వారికి ఓట్లు వేయాలని ఆయన కోరారు.మూడు కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తులతో పంజాబ్ తర్వాత స్థానంలో తెలంగాణ ఉందని ఆదాయం పెరిగేకొద్దీ సంక్షేమ పథకాలకు నిధులను పెంచుకుంటూ వెళ్తామని జరుగుతున్న అభివృద్ధిని ఆపవద్దని ఆయన ప్రజలకి విన్నవించారు.