ప్రస్తుత స్మార్ట్ ఫోన్( Smartphones ) లకు అప్డేట్ మోడల్స్ సరికొత్త రీతిలో మార్కెట్లోకి వస్తూనే ఉన్నాయి.గతంలో చాలా కాలం ఫీచర్ ఫోన్స్ ఉండేవి.
కొంతకాలం తర్వాత ఫీచర్ ఫోన్స్ కు అప్డేట్ మోడల్స్ గా స్మార్ట్ ఫోన్స్ మార్కెట్లోకి వచ్చాయి.తాజాగా స్మార్ట్ ఫోన్ లకు అప్డేట్ మోడల్స్ గా ఫోల్డబుల్ ఫోన్స్( Foldable Phones ) హవా నడుస్తోంది.
కానీ ఈ ఫోన్ లకు కూడా అప్డేట్ మోడల్ బెండింగ్ ఫోన్ త్వరలోనే మార్కెట్లోకి అందుబాటులోకి రానుంది.ప్రముఖ టెలి కమ్యూనికేషన్ దిగ్గజం మోటోరోలా( Motorola ) ఈ బెండింగ్ ఫోన్ ను ఆవిష్కరించింది.
తమ మాతృ సంస్థ లెనోవో టెక్ వరల్డ్ 2023లో అత్యాధునిక ప్రోటో టైప్ బెండింగ్ స్మార్ట్ ఫోన్ ను మోటోరోలా పరిచయం చేసింది.

ఫోల్డబుల్ ఫోన్లకు అప్డేట్ మోడల్ గా వస్తున్న ఈ బెండింగ్ ఫోన్లను( Motorola’s Bendable Phone ) రౌండ్ గా చుట్టేయవచ్చు.చేతికి వాచీ లేదా బ్రాస్లైట్ లాగా కూడా ఈ ఫోన్ ను ధరించవచ్చు.కస్టమర్లకు నచ్చిన విధంగా ఎలా కావాలంటే అలా ఉపయోగించుకోవడానికి ఈ ఫోన్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది.2016లో టెక్ వరల్డ్ ఈవెంట్ లోనే ఈ బెండింగ్ ఫోన్ ను సంస్థ పరిచయం చేసింది.ప్రస్తుతం ఈ ఫోన్ ను త్వరలోనే మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు కంపెనీ సిద్ధమవుతోంది.

ఈ ఫోన్ కు సంబంధించిన ధర, ఫీచర్స్ వివరాలు ( Motorola’s Bendable Phone Features )సంస్థ ఇంకా ప్రకటించలేదు.ఈ ఫోన్ ఫుల్ HD, పీవోఎల్ ఈడీ డిస్ ప్లే తో ఉంటు 6.9 అంగుళాల స్క్రీన్ తో మార్కెట్లోకి వస్తుందట.కస్టమర్లు తమ అవసరాన్ని బట్టి స్క్రీన్ ను 4.6 అంగుళాల వరకు తగ్గించుకునే సౌకర్యం ఉంటుంది.ప్రస్తుత మోడల్స్ కంటే కెమెరా, స్టోరేజ్, ర్యామ్, బ్యాటరీ ఈ ఫోన్లో చాలా మెరుగుగా ఉంటాయని అంచనా.







