అమెరికాలో గ్రీన్ కార్డ్( US Green Card ) కోసం కాళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న భారతీయుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోన్న సంగతి తెలిసిందే.వారి కోటా వచ్చేసరికి దరఖాస్తు చేసుకున్న భారతీయులు జీవించి వుంటారన్న గ్యారెంటీ వుండటం లేదంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.
ఈ నేపథ్యంలో భారతీయ అమెరికన్ల కోసం .‘‘ employment authorisation cards ’’ జారీ నిబంధనలను సడలించాలని ఓ ప్రవాస భారతీయ సంఘం బైడెన్ యంత్రాంగాన్ని కోరింది.
దాదాపు 1.1 మిలియన్ల మంది భారత సంతతికి చెందిన నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా హోల్డర్లు( Non Immigrant Visa Holders ) గ్రీన్ కార్డ్ కోసం ఐ 485 కోసం దరఖాస్తు చేసుకోవడానికి తమ ప్రాధాన్యత తేదీ కోసం ఎదురుచూస్తున్నారని.‘‘ఫౌండేషన్ ఫర్ ఇండియా అండ్ ఇండియన్ డయాస్పోరా స్టడీస్ ’’ (ఎఫ్ఐఐడీఎస్) తెలిపింది.గ్రీన్‌కార్డ్ జారీకి గాను అమెరికా ప్రభుత్వం అనుసరిస్తున్న 7 శాతం కంట్రీ క్యాప్ విధానం భారతీయులకు శరాఘాతంలా మారిందని ఫౌండేషన్ ఆవేదన వ్యక్తం చేసింది.
దీని వల్ల భారతీయులకు గ్రీన్ కార్డ్ రావాలంటే 135 సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వుంటుంది.అంతేకాదు.దాదాపు 4,00,000 మందికి వారి జీవితకాలంలో శాశ్వత నివాసాన్ని పొందలేరని పేర్కొంది.
గ్రీన్‌కార్డ్ ప్రాసెసింగ్ ప్రారంభ దశలలో ఎంప్లాయ్‌మెంట్ ఆథరైజేషన్ కార్డులను జారీ చేయడం వల్ల పెద్ద సంఖ్యలో భారతీయ అమెరికన్లు, వారి జీవిత భాగస్వాములు, పిల్లలకు సాయంగా వుంటుందని ఎఫ్ఐఐడీఎస్ ( FIIDS ) తెలిపింది.డాక్యుమెంటెడ్ డ్రీమర్స్ కోసం హెచ్ 4 ఈఏడీని( H4-EAD ) అనుమతించాలని, వారి వీసా కవరేజీని 21 సంవత్సరాల నుంచి పాతికేళ్లకు పెంచాలని సంస్థ విజ్ఞప్తి చేసింది.వారు సొంత ఇమ్మిగ్రేషన్ మార్గాన్ని అనుసరించే వరకు స్థిరమైన స్థితిని అందించాలని ఎఫ్ఐఐడీఎస్ చీఫ్ పాలసీ అండ్ స్ట్రాటజీస్ ఖండేరావ్ కాండ్( Khanderao Kand ) ప్రభుత్వానికి రాసిన లేఖలో కోరారు.
కాగా.గ్రీన్‌కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారితోపాటు వలసేతర వర్గాలకు ఐదేళ్లపాటు (employment authorisation cards ) ఉపాధి అధికార కార్డులను అందజేస్తామని గత వారం అమెరికా ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.ఈ చర్య దేశంలో నివసిస్తున్న వేలాది మంది భారతీయులకు ప్రయోజనం చేకూరుస్తుందని నిపుణులు చెబుతున్నారు.యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీస్ (యూఎస్‌సీఐఎస్) ఈ మేరకు ప్రకటన చేసింది.
ఎంప్లాయ్‌మెంట్ ఆథరైజేషన్ కార్డుల చెల్లుబాటు వ్యవధిని ఐదేళ్లకు పెంచుతున్నట్లు ఏజెన్సీ వెల్లడించింది.వీటిలో ఆశ్రయం కోసం దరఖాస్తుదారులను నిలిపివేయడం, ఐఎన్ఏ 245( INA 245 ) కింద స్థితిని సర్దుబాటు చేయడం, తొలగింపును రద్దు చేయడం వంటివి వున్నాయని యూఎస్‌సీఐఎస్ తెలిపింది.
ఈఏడీల చెల్లుబాటు వ్యవధిని ఐదేళ్లకు పెంచడం అనేది కొత్త ఐ 765 ఫాంల సంఖ్యను గణనీయంగా తగ్గించడానికి ఉద్దేశించబడింది.దీని వల్ల సంబంధిత ప్రాసెసింగ్ సమయాలు, బ్యాక్‌లాగ్‌లను తగ్గించడానికి దోహదం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఏది ఏమైనప్పటికీ అమెరికా పౌరుడు కానీ వ్యక్తి ఉపాధి అనేది వారి అంతర్లీన స్థితి, పరిస్ధితులు, ఈఏడీ ఫైలింగ్ కేటగిరీపై ఆధారపడి వుంటుంది.