ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో ఏర్పాటైన కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం ముగిసింది.దాదాపు మూడున్నర గంటల పాటు భేటీ కొనసాగింది.
ఇందులో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితాపై పార్టీ నాయకులు కసరత్తు చేశారు.ఇప్పటికే తొలి జాబితాలో భాగంగా 55 మంది అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ పొత్తుల్లో భాగంగా వామపక్షాలకు నాలుగు సీట్లను కేటాయించిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో మరో 60 సీట్లలో అభ్యర్థుల ఎంపిక చేసిన నేతలు లిస్టును ప్రకటించే అవకాశం ఉంది.అదేవిధంగా సుమారు పది స్థానాలకు అభ్యర్థుల ఎంపిక ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.
దీంతో ఈ జాబితాను ఈ నెలాఖరుకు ప్రకటించే ఛాన్స్ ఉందని సమాచారం.







