ఎల్లారెడ్డిపేట మండలం వ్యాప్తంగా అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు

రాజన్న సిరిసిల్ల జిల్లా: రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా, ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం తో పాటు వివిధ మండలాలు, గ్రామాలలో సద్దుల బతుకమ్మ వేడుకలను మహిళలు ఘనంగా జరుపుకున్నారు.పితృ అమావాస్య రోజు పెద్దలకు బియ్యం ఇచ్చిన నుండి బతుకమ్మలను తొమ్మిది రోజులు తీరొక్క రంగులతో పేరుస్తూ, రంగురంగుల పూలను తీసుకువచ్చి అత్యంత భక్తిశ్రద్ధలతో బతుకమ్మలను పేరుస్తూ గ్రామ ప్రధాన కూడళ్ళలో బతుకమ్మలను పెట్టి ఆట పాటలతో, కోలాటాలు, దాండియాలతో నృత్యాలు చేస్తూ సంబరాలతో బతుకమ్మ వేడుకలు జరుపుకున్నారు.

 Saddula Bathukamma Celebrations All Over Ellareddypet Mandal, Saddula Bathukamma-TeluguStop.com

అనంతరం బతుకమ్మను గంగమ్మ ఒడిలోకి చేర్చి, గౌరమ్మ పసుపు కుంకుమ వైనాలు పంచుకున్నారు.పోయిరావమ్మా బతుకమ్మ వెళ్లి రావమ్మా గౌరమ్మ అంటూ మహిళలు భక్తిశ్రద్ధలతో బతుకమ్మ వేడుకలు జరుపుకున్నారు.

ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ ఒగ్గు రజిత యాదవ్, మాజీ ఎంపిటిసి ఒగ్గు బాలరాజు యాదవ్, మహిళలు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube