ఎల్లారెడ్డిపేట మండలం వ్యాప్తంగా అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు

రాజన్న సిరిసిల్ల జిల్లా: రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా, ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం తో పాటు వివిధ మండలాలు, గ్రామాలలో సద్దుల బతుకమ్మ వేడుకలను మహిళలు ఘనంగా జరుపుకున్నారు.

పితృ అమావాస్య రోజు పెద్దలకు బియ్యం ఇచ్చిన నుండి బతుకమ్మలను తొమ్మిది రోజులు తీరొక్క రంగులతో పేరుస్తూ, రంగురంగుల పూలను తీసుకువచ్చి అత్యంత భక్తిశ్రద్ధలతో బతుకమ్మలను పేరుస్తూ గ్రామ ప్రధాన కూడళ్ళలో బతుకమ్మలను పెట్టి ఆట పాటలతో, కోలాటాలు, దాండియాలతో నృత్యాలు చేస్తూ సంబరాలతో బతుకమ్మ వేడుకలు జరుపుకున్నారు.

అనంతరం బతుకమ్మను గంగమ్మ ఒడిలోకి చేర్చి, గౌరమ్మ పసుపు కుంకుమ వైనాలు పంచుకున్నారు.

పోయిరావమ్మా బతుకమ్మ వెళ్లి రావమ్మా గౌరమ్మ అంటూ మహిళలు భక్తిశ్రద్ధలతో బతుకమ్మ వేడుకలు జరుపుకున్నారు.

ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ ఒగ్గు రజిత యాదవ్, మాజీ ఎంపిటిసి ఒగ్గు బాలరాజు యాదవ్, మహిళలు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.

పాస్‌పోర్ట్‌లో థాయ్‌లాండ్‌ ట్రిప్ వివరాలు చెరిపేసిన యువతి.. కట్ చేస్తే దిమ్మతిరిగే షాక్..?