ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun ) తాజాగా పుష్ప సినిమాకు గాను నేషనల్ అవార్డు ( National Award ) అందుకున్న విషయం మనకు తెలిసిందే.ఇలా తెలుగు చిత్ర పరిశ్రమకు అల్లు అర్జున్ తో పాటు మరికొంతమందికి కూడా ఇలా జాతీయ అవార్డులు రావడంతో తెలుగు చిత్ర పరిశ్రమ ఎంతో గర్విస్తోంది.
ఇలా తెలుగు చిత్ర పరిశ్రమకు ఈ విధంగా నేషనల్ అవార్డ్స్ రావడంతో మైత్రి మూవీ మేకర్స్( Mythri Movie Makers ) వారు ఈ అవార్డు గెలుచుకున్న వారందరికీ కూడా ప్రత్యేకంగా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఘనంగా సత్కరించారు.ఇలా శనివారం రాత్రి హైదరాబాద్లో మైత్రి మూవీ మేకర్స్ వారు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి నేషనల్ అవార్డు విన్నర్స్ అందరూ హాజరయ్యారు అలాగే పలువురు సినిమా సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు.
![Telugu Allu Arjun, National Award, Prakash Raj, Tollywood-Movie Telugu Allu Arjun, National Award, Prakash Raj, Tollywood-Movie](https://telugustop.com/wp-content/uploads/2023/10/Actor-prakash-raj-fire-on-tollywood-heroesa.jpg)
ఈ వేడుకకు ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ ( Prakash Raj ) కూడా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ చేసినటువంటి కొన్ని కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.తెలుగు చిత్ర పరిశ్రమకు ఏకంగా ఐదు నేషనల్ అవార్డ్స్ రావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.ఇలాంటి అవార్డ్స్ వస్తే ఎంత సంతోషంగా ఉంటుందో నాకు తెలుసని పాతికేళ్ల క్రితం అంతపురం సినిమాకు తాను నేషనల్ అవార్డు అందుకున్నప్పుడు కూడా తనలో ఇలాంటి గర్వం కనిపించిందని ఈయన తెలియజేశారు.
![Telugu Allu Arjun, National Award, Prakash Raj, Tollywood-Movie Telugu Allu Arjun, National Award, Prakash Raj, Tollywood-Movie](https://telugustop.com/wp-content/uploads/2023/10/Actor-prakash-raj-fire-on-tollywood-heroesb.jpg)
ఇలా తెలుగు చిత్ర పరిశ్రమకు ఎన్నో అద్భుతమైన పురస్కారాలు రావడం ఎంతో గర్వించదగ్గ విషయం ఈ వేడుకను ప్రతి ఒక్క తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన వారు కూడా జరుపుకోవాల్సిన వేడుక ఇది అంటూ ఈయన తెలియజేశారు.అయినప్పటికీ ఇలాంటి వేడుకలు భాగం కావడానికి తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన హీరోలు ఎందుకు కలిసి రావడం లేదు అంటూ ఈయన ప్రశ్నించారు.అల్లు అర్జున్ నటుడిగా తొలిసారి నేషనల్ అవార్డు అందుకున్నారు.అలాగే ఆస్కార్ స్థాయిలో మన సినిమాలను పరిచయం చేసిన రాజమౌళి దేవి శ్రీ ప్రసాద్ వంటి వారంతా కూడా ఈ నేషనల్ అవార్డు అందుకుంటే వారిని ప్రోత్సహించడానికి తెలుగు హీరోలు ఎందుకు కలిసి రావడం లేదు అంటూ ఈ సందర్భంగా ఈయన చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.