ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ( Chandra Babu Naidu ) స్కిల్ డెవలప్ స్కాంలో భాగంగా అరెస్టు అయిన విషయం మనకు తెలిసిందే.ఏపీ రాష్ట్ర రాజకీయాలలో ఎంతో కీలక పాత్ర పోషించినటువంటి చంద్రబాబు నాయుడు తన హయామంలో స్కిల్ డెవలప్ స్కామ్ లో భాగంగా భారీ అవినీతికి పాల్పడ్డారు అంటూ సిఐడి అధికారులు తనని కస్టడీలోకి తీసుకున్న సంగతి మనకు తెలిసిందే.
ఇలా సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ అరెస్టు అయినటువంటి ఇప్పటివరకు రాజమండ్రి జైలులోనే ఉన్నారు.నవంబర్ 9వ తేదీ వరకు రిమాండ్ పొడిగించడం గమనార్హం.

ఈ విధంగా చంద్రబాబు నాయుడు అరెస్ట్ కావడంతో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు రోడ్లపైకి వచ్చే చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా తెలియజేశారు.ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం కక్ష సాధింపు చర్యలలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడుని ఈ వయసులో జైలులో ఉంచి తనని చిత్రహింసలకు గురిచేస్తున్నారు అంటూ పెద్ద ఎత్తున తెలుగుదేశం నేతలు ఆరోపణలు చేస్తున్నారు.మరోవైపు ఢిల్లీ నుంచి ఎంతో పెద్ద పెద్ద లాయర్లు అందరూ కూడా చంద్రబాబు నాయుడుకి బయటకు రావడం కోసం ప్రయత్నాలు చేస్తున్న ఈయనకి మాత్రం రిమాండ్ పొడిగిస్తూనే ఉన్నారు.

ఇలా చంద్రబాబు నాయుడు జైలులో ఉండగా ఎంతోమంది సినీ సెలబ్రిటీలు కూడా ఆయన అరెస్టు సవ్యంగా జరగలేదని ఆధారాలు లేకుండానే అతని అరెస్టు చేశారు అంటూ పలువురు టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందినటువంటి సెలబ్రెటీలు కూడా చంద్రబాబు నాయుడుకు మద్దతు తెలియజేశారు.అయితే తాజాగా మరొక హీరోయిన్ చంద్రబాబు నాయుడు విడుదల కావాలి అంటూ ఏకంగా ప్రత్యేక పూజలు కూడా చేయించారని తెలుస్తోంది.తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ కంటే కూడా వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా ఎంతో గుర్తింపు సంపాదించుకున్నటువంటి నటి పూనమ్ ( Poonam )తాజాగా చంద్రబాబు నాయుడు గురించి ప్రత్యేకంగా పూజలు చేశారని తెలుస్తుంది.

ఈమె సినిమాలలో నటించినది చాలా తక్కువ అయినప్పటికీ ఎన్నో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచారు.ఇలా వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వార్తల్లో ఉన్నటువంటి ఈమె సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలతో పాటు రాజకీయాలకు సంబంధించిన విషయాల గురించి కూడా తన అభిప్రాయాలను తెలియజేస్తుంటారు.అయితే చంద్రబాబు నాయుడు అరెస్టు అయిన సమయంలో కూడా ఈమె ఈ అరెస్టును ఖండిస్తూ మద్దతు తెలియజేశారు.ఇక తాజాగా నవరాత్రి వేడుకలు సందర్భంగా తన కుటుంబంతో కలిసి విజయవాడ దుర్గమ్మ దర్శనం కోసం ఈమె కుటుంబంతో కలిసి వచ్చారు.
ఇలా అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత పూనమ్ మీడియాతో మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ చంద్రబాబు నాయుడుని ఈ వయసులో జైలులో పెట్టడం తనని చాలా బాధ కలిగిస్తుందని ఆయన తొందరలోనే బయటకు రావాలని అమ్మవారిని వేడుకున్నాను అంటూ ఈ సందర్భంగా పూనమ్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
మరి ఈమె పూజలు ఫలించి ఈసారైనా చంద్రబాబు నాయుడుకి బెయిల్ వస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.