ఈ మధ్యకాలంలో చాలా మంది ఏమీ తినకుండానే బరువు ( weight )పెరిగేస్తున్నారు.అలాగే అధిక బరువుతో చాలామంది యువత చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అయితే అధిక బరువుని కంట్రోల్ చేయడం కోసం వాళ్లు నోరు కట్టేసుకుని గంటలు తరబడి జిమ్( Gym ) చేసి ఎలాగోలా మొత్తానికి బరువు తగ్గిపోతారు.కానీ జిమ్ అనగానే ఎంత వేగంగా అయితే బరువు తగ్గుతారో, అంతే వేగంగా మళ్ళీ బరువు పెరిగిపోతారు.
అయితే ఇలా జరగకుండా ఉండాలి అంటే ఎక్కువ రోజులు ఫీట్ గా ఉండాలి అంటే ఏం చేయాలో, జిమ్ కి వెళ్లకుండానే బరువు ఎలా తగ్గాలో ఇప్పుడు తెలుసుకుందాం.అయితే చాలామంది బరువును తగ్గించుకునేందుకు కార్డియో చేస్తూ డైట్ పాటిస్తారు.

దీని వలన రెండు నెలల వరకు బరువు తగ్గుతారు.కానీ కొవ్వు తగ్గరు.దీనివల్ల మరింత బరువు పెరుగుతారు.దీన్ని తగ్గించేందుకు ఇప్పుడు మనం కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి.బరువు తగ్గినప్పుడు మజిల్ పవర్, మాస్ పవర్, ఫ్యాట్ తగ్గుతుంది.అలాగే స్పీడ్ గా కూడా బరువు తగ్గుతారు.
అయితే సరిగ్గా ఫ్యాట్ లాస్ అవ్వాలంటే వర్కౌట్ తో పాటు సరైన ఫుడ్ కూడా తీసుకోవాలి.ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.
కండరాల కోసం మంచి ప్రోటీన్ రిచ్ డైట్ కంట్రోల్, కండరాలను పెంచడానికి, వర్కౌట్ చేయడానికి, బాడీని ఫిట్ గా చేయడానికి చాలా ఉపయోగపడుతుంది.

అయితే దీనికోసం ప్రోటీన్ రిచ్ ఫుడ్ ( Protein rich food )తో పాటు ఫైబర్ కూడా తీసుకోవాలి.ఇంకా మంచి ఆహారం, వర్క్ అవుట్, నిద్రతో( diet, work out, sleep ) పాటు, బాడీలోని కొవ్వుని తొలగించడంలో ఇది బాగా సహాయపడుతుంది.అంతేకాకుండా కొవ్వు తగ్గితే కనుక త్వరగా బరువు పెరగలేరు.
కాబట్టి బరువు పెరగాలంటే ప్రోటీన్ డైట్ తీసుకోవాలి అన్న విషయం అపోహ మాత్రమే.నిజానికి బరువు తగ్గాలనుకునేవారు ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం మంచిది.
దీని వలన మజిల్స్ హెల్తీగా ఉంటాయి.అంతేకాకుండా కార్బోహైడ్రేట్స్ కూడా బరువును తగ్గిస్తాయి.
కానీ బాడీ పనిచేసేందుకు కార్బోహైడ్రేట్స్ చాలా అవసరం.లేకపోతే ప్రోటీన్ శక్తిగా మారిపోతుంది.
దీనికి ప్రోటీన్ చాలా అవసరం ఉంటుంది.