ఏపీ సీఐడీ అధికారుల కాల్ డేటా రికార్డ్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది.ఈ పిటిషన్ పై విచారణ జరిపిన విజయవాడలోని ఏసీబీ కోర్టు తదుపరి విచారణను ఈనెల 26కు వాయిదా వేసింది.
విచారణలో భాగంగా పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీ పీపీని ఏసీబీ కోర్టు ఆదేశించింది.ఈ క్రమంలో సీఐడీ తరపు న్యాయవాది ఈ నెల 26 వరకు సమయం కావాలని కోర్టును కోరారు.
దీంతో ధర్మాసనం తదుపరి విచారణను ఈనెల 26వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది.స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేయడానికి ముందు, అరెస్ట్ సమయంలో సీఐడీ అధికారుల కాల్ డేటా రికార్డ్స్ కావాలంటూ ఆయన తరపు న్యాయవాదులు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.







