మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడిన అభియోగంపై భారత సంతతికి చెందిన వ్యక్తికి యూకే కోర్టు( UK Court ) జైలు శిక్ష విధించింది.నిందితుడు 2021లో రైలులో( Train ) ఒక మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు నేరాన్ని అంగీకరించాడు.
దీంతో అతనికి 16 వారాల జైలు శిక్షతో పాటు లైంగిక నేరస్థుల రిజిస్టర్‌లో ఏడేళ్లపాటు వుంచాల్సిందిగా న్యాయస్థానం ఆదేశించింది.వెస్ట్ మిడ్‌ల్యాండ్స్ కౌంటీలోని శాండ్‌వెల్‌కు చెందిన ముఖన్ సింగ్‌కు( Mukhan Singh ) ఈ మేరకు శిక్ష విధించింది.
దీనితో పాటు 128 పౌండ్ల సర్‌చార్జ్ చెల్లించాలని ఆదేశించింది.

2021 సెప్టెంబర్‌లో ఘటన జరిగిన రోజున 20 ఏళ్ల బాధితురాలు బర్మింగ్‌హామ్ మూర్ స్ట్రీట్ నుంచి లండన్ మేరిల్‌బోన్‌కు రైలులో ప్రయాణిస్తోంది.ఈ క్రమంలో నిందితుడు ముఖన్ సింగ్.ఆమెను అదే పనిగా చూస్తున్నట్లు ప్రాసిక్యూటర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
కాసేపటి తర్వాత వచ్చి బాధితురాలి పక్కన కూర్చొన్నాడు.ఆమెను ఎటూ కదలకుండా చేసి అసభ్యంగా ప్రవర్తించడం( Misbehave ) మొదలుపెట్టాడని వార్విక్‌షైర్ వరల్డ్ న్యూస్ పోర్టల్ గత వారం నివేదించింది.
అయితే బాధితురాలు తెలివిగా ముఖన్ సింగ్ చేస్తున్నదంతా సెల్‌లో రికార్డ్ చేసింది.అనంతరం అతను లీమింగ్టన్ స్పా వద్ద రైలు దిగి వెళ్లిపోతుండగా భద్రతా సిబ్బందిని ఆమె అప్రమత్తం చేసింది.
వెంటనే సెక్యూరిటీ సిబ్బంది ముఖన్ సింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు.

ఈ ఘటనపై దర్యాప్తు అధికారి హారిస్( Detective Constable Harris ) మీడియాతో మాట్లాడుతూ.ఇది సురక్షితంగా ప్రయాణించడానికి పూర్తి హక్కు వున్న యువతిని లక్ష్యంగా చేసుకున్న దాడిగా అభివర్ణించారు.కోర్టు శిక్షపై హారిస్ సంతోషం వ్యక్తం చేశారు.
ఈ ఏడాది ప్రారంభంలో 34 ఏళ్ల సైమన్ అబ్రహం( Simon Abraham ) అనే వ్యక్తి మహిళా రోగిపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు గాను యూకే కోర్టు అతనికి 18 నెలల జైలు శిక్షను విధించింది.నిందితుడు రెండేళ్లపాటు భారత్‌లో స్పెషలిస్ట్ మసాజ్‌లో శిక్షణ పొందాడు.







