ఢిల్లీలో బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ జరగనుంది.ఈ మేరకు రేపు సాయంత్రం 6.30 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు.
ఈ సమావేశంలో తెలంగాణతో పాటు మిజోరాం రాష్ట్రాలలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే బీజేపీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు జరగనుందని తెలుస్తోంది.
అదేవిధంగా ఈనెల 19వ తేదీన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ మరోసారి సమావేశంకానుంది.ఈ భేటీలో రాజస్థాన్ లో అభ్యర్థుల ఎంపికతో పాటు ఎంపీ అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది.







