టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో అక్కినేని నాగార్జున( Nagarjuna ) ఒకరు.ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి ఈయన ఎన్నో సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించారు.
నాగార్జునకు ఎక్కువగా అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పాలి.మన్మధుడుగా ఈయన ఎంతోమంది అమ్మాయిల మనసును దోచేశారు.
దీంతో ఈయనకు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా కాస్త ఎక్కువ అని చెప్పాలి.ఇక నాగార్జున సైతం సినిమాలలో అమ్మాయిలతో ఎంతో చనువుగా ఉన్నటువంటి పాత్రలలోనే నటిస్తూ కనిపిస్తుంటారు.

ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్న సమయంలో ఈయన నటించే సినిమాల సమయంలో రొమాంటిక్ సన్నివేశాలు వస్తే కనుక వాటిలో లీనమై నటించేవారు.ఇలా నాగార్జున నటించిన ఇలాంటి సన్నివేశాలు ఎన్నో ఉన్నాయని చెప్పాలి అయితే తాజాగా ఈయనకు సంబంధించి మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈయన సినిమా షూటింగ్లో భాగంగా ఇలాంటి ఒక రొమాంటిక్ సన్ని వేషంలో నటించాల్సి వచ్చింది.అయితే ఈ పాత్రలో లీనమైపోయినటువంటి నాగార్జున నటించడం మానేసి నిజంగానే హీరోయిన్ బుగ్గ కొరికేసారట దీంతో ఒక్కసారిగా ఆ హీరోయిన్ నాగార్జున పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా అక్కడ నుంచి వెళ్లిపోయిందని తెలుస్తుంది.

ఈ విధంగా నాగార్జున హీరోయిన్ బుగ్గ కొరికారు అంటూ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.మరి ఈయన ఏ హీరోయిన్ బుగ్గ కొరికారు అనే విషయానికి వస్తే.నాగార్జున ఇండస్ట్రీలో ఎక్కువగా నటించినటువంటి హీరోయిన్ల జాబితాలో ముంబై ముద్దుగుమ్మ టబు (Tabu) కూడా ఉంటారనే విషయం మనకు తెలిసిందే.వీరిద్దరి కాంబినేషన్లో ఎన్నో సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.
అయితే నిన్నే పెళ్ళాడుతా (Ninne Pelladuthaa) సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే.సినిమా షూటింగ్ సమయంలోనే ఇలాంటి సంఘటన జరిగిందని తెలుస్తోంది.

నిన్నే పెళ్ళాడుతా సినిమా షూటింగ్ సమయంలో ఒక రొమాంటిక్ సన్ని వేషంలో నటించాల్సి రాగా ఈయన నిజంగానే హీరోయిన్ బుగ్గ కొరకడంతో ఆమె అక్కడి నుంచి చాలా సీరియస్గా వెళ్ళిపోయిందని తిరిగి దర్శక నిర్మాతలు బ్రతిమలాడటంతో వచ్చి ఆ సన్నివేశంలో నటించిందని తెలుస్తుంది.అయితే ఈ సీన్ జరిగిన తర్వాత వీళ్ళిద్దరి మధ్య కాస్త చనువు కూడా పెరిగిందని దీంతో ప్రేమలో ఉన్నారు అంటూ కూడా వార్తలు వచ్చాయి.ఇక ఈమె హైదరాబాద్ వచ్చిన ప్రతిసారి తప్పకుండా నాగార్జునని కలిసేదని నాగార్జునతో ప్రేమలో పడటం వల్లే ఇప్పటివరకు ఈమె పెళ్లి చేసుకోకుండా ఉన్నారు అంటూ కూడా అప్పట్లో ఈ జంట గురించి ఎన్నో రకాల వార్తలు వినిపించాయి.అయితే నాగార్జున ఈ వార్తలు అన్నింటిని కొట్టి పారేశారు.
తాను నాకంటే అమల(Amala) కు మంచి స్నేహితురాలని అమలను కలవడం కోసమే హైదరాబాద్ వచ్చిన ప్రతిసారి మా ఇంటికి వచ్చేవారు అంటూ నాగార్జున ఈ వార్తలను పలు సందర్భాలలో ఖండించారు.