సైబర్ నేరాల్లో టాప్-5 లో భారత్.. గడిచిన ఆరు నెలల్లోనే..?

అంతర్జాతీయ నివేదికల ప్రకారం సైబర్ దాడుల్లో భారతదేశం( India ) టాప్-5 లో ఉంది.2023 లో తక్కువ కాలంలోనే లక్షల కొద్ది సైబర్ నేరాలు( Cyber Crimes ) భారత్ లో నమోదయ్యాయి.జపాన్ కు చెందిన ఐటీ సెక్యూరిటీ సంస్థ ట్రెండ్ మైక్రో( Trend Micro ) రూపొందించిన మిడ్ ఇయర్ సైబర్ సెక్యూరిటీ పోర్టల్ లో భారత్ సైబర్ క్రైమ్ లలో టాప్ ఫైవ్ లో ఉన్నట్లు తెలిసింది.ఈ 2023 ఏడాది మొదటి ఆరు నెలల్లోనే సుమారుగా 90 వేలకు పైగా మాల్వేర్ డిటెక్షన్లు జరిగినట్లు ఆ సంస్థ గుర్తించింది.

 India Emerges Top-5 Victim Of Cyber Attacks Details, India ,top-5 Victim ,cyber-TeluguStop.com

ఆన్లైన్ బ్యాంకింగ్ మాల్వేర్ డిటెక్షన్ లలో ప్రపంచవ్యాప్తంగా భారత్ నాలుగవ స్థానంలో ఉంది.ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లోనే 5600 పైగా ఆన్లైన్ మాల్వేర్ బెదిరింపులు జరిగినట్లు నివేదిక పేర్కొంది.

ఈ నివేదికల ప్రకారం ఈ 2023 ఏడాదిలో అమెరికా, బ్రెజిల్ తర్వాత అత్యధిక సైబర్ నేరాలు జరుగుతున్న దేశంగా ఇండియా నిలిచింది.భారత్ లో బ్యాంకింగ్( Banking ) రంగంతో పాటు తయారీ రంగం, ఐటీ రంగాలు కూడా మాల్వేర్ దాడుల బారిన పడ్డాయి.

అంటే ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో 85 బిలియన్లకు పైగా సైబర్ నేరాలకు సంబంధించిన బెదిరింపులు గుర్తించబడ్డాయి.

Telugu America, Brazil, Cyber, Debit Fraud, India, Top, Trend Micro-Technology T

డిజిటల్ డిఫెన్స్( Digital Defence ) రిపోర్ట్ ప్రకారం ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో సైబర్ దాడుల్లో భారత్ వాటా 13 శాతంగా ఉంది.ఈ లెక్కన చూస్తే.సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేస్తున్న దేశాలలో మన భారతదేశం ఐదవ స్థానంలో ఉంది.

భారతదేశానికి చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో( ISRO ) కూడా రోజుకి వందకి పైగా సైబర్ దాడులను ఎదుర్కొంటున్నట్లు ఓ నివేదిక తెలిపింది.సైబర్ నేరాలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్( AI ) లాంటి టెక్నాలజీ కూడా తోడు అవుతూ ఉండడంతో భారీగా సైబర్ నేరాలు పెరుగుతున్నాయి.

Telugu America, Brazil, Cyber, Debit Fraud, India, Top, Trend Micro-Technology T

మన భారత దేశంలో జరుగుతున్న సైబర్ దాడుల విషయానికి వస్తే.క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్, మాల్వేర్ అటాక్స్, ర్యాన్సమ్ వేర్ అటాక్స్, ఐడెంటిటీ థెప్ట్స్, సైబర్ స్టాకింగ్, ఫిషింగ్ లాంటివి అధికంగా జరుగుతున్నాయి.కాబట్టి మనమంతా సైబర్ నేరగాళ్ల వలలో చిక్కకుండా ఉండాలంటే అనవసరమైన లింకులపై క్లిక్ చేయకూడదు.ఓటిపిని అపరిచితులకు చెప్పకూడదు.గిఫ్ట్ లాంటివి వస్తే అత్యాశకు పోకూడదు.అనుమానం వస్తే ఆలస్యం చేయకుండా సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube