సినిమా ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్లు వరుసగా సినిమాలు చేస్తూ వాళ్ళకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంటున్న విషయం మనకు తెలిసిందే.ఇక సినిమా అనేది తెలుగు,తమిళం, మలయాళం,కన్నడ, హిందీ అని ఇంతకు ముందు ఉన్నట్టు గా ఇప్పుడు లేదు.
ప్రస్తుతం అన్ని భాషలకు కలిపి ఒకటే సినిమా ఉంది అదే ఇండియన్ సినిమా… కాబట్టి వేరే లాంగ్వేజ్ లో ఉన్న హీరోతో మన డైరెక్టర్లు సినిమాలు చేస్తున్నారు, మన హీరో లతో వేరే భాషల డైరెక్టర్లు సినిమాలు చేస్తున్నారు.ఇప్పుడు సినిమా అంతా ఒకటే అయిపోయింది.
అదే ఇండియన్ సినిమాగా అయిపోవడం వల్ల ఎవరు ఎవరితో అయిన సినిమా చేసేస్తున్నారు.అడ్డంకులు కూడా ఏమీ ఉండకపోవడంతో మనకు నచ్చిన కథకి ఏ హీరో అయితే సెట్ అవుతాడో ఆ హీరోతో సినిమా చేయడం జరుగుతుంది…

ఇక అందులో భాగంగా ఇప్పటికే మన వంశీ పైడిపల్లి తమిళ్ స్టార్ హీరో అయిన విజయ్ తో వారసుడు( Vaarasudu ) అనే సినిమా చేశాడు.అలాగే తమిళ్ డైరెక్టర్ అయిన అట్లీ షారుక్ తో జవాన్( Jawan ) అనే సినిమా చేశాడు.ఇక ఇప్పుడు కూడా మన తెలుగు డైరెక్టర్ ఒకరు తమిళ్ స్టార్ హీరో అయిన అజిత్ తో ఒక సినిమా చేయబోతున్నట్టుగా తెలుస్తుంది.

ఆ డైరెక్టర్ ఎవరు అంటే రీసెంట్ గా స్కంద సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న బోయపాటి శ్రీను ( Boyapati Srinu )కూడా హీరో అజిత్ తో ఒక సినిమా చేయబోతున్నట్టుగా తెలుస్తుంది.ఇప్పటికే తమిళ్ ప్రొడ్యూసర్లు కొంతమంది బోయపాటి ని అప్రోచ్ అయి సినిమా చేయమన్నట్టుగా తెలుస్తుంది.ఇక అజిత్ కూడా మాస్ సినిమాలు ఎక్కువగా చేస్తాడు.కాబట్టి బోయపాటి సినిమాలకి అజిత్ చాలా బాగా సరిపోతాడు.అయితే ప్రస్తుతం బోయపాటి బాలయ్య తో ఒక సినిమా చేయాల్సి ఉంది ఆ సినిమా తర్వాత అజిత్ తో సినిమా ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది…
.







