బీఆర్ఎస్ గూటికి మాజీ మంత్రి పొన్నాల..!!

మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య బీఆర్ఎస్ పార్టీలో చేరతారనే ప్రచారం జోరుగా సాగుతోంది.తాజాగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన పొన్నాల ఆ పార్టీలో బీసీలకు తీరని అన్యాయం జరుగుతోందని ఆరోపించారు.

 Former Minister Ponnala Lakshmaiah Is Likely To Join Brs Party.!!-TeluguStop.com

ఈ క్రమంలోనే బీఆర్ఎస్ లో బీసీలకు సముచిత స్థానం లభిస్తుందని పొన్నాల రాజీనామా లేఖలో ప్రస్తావించిన సంగతి తెలిసిందే.దీంతో పరోక్షంగా బీఆర్ఎస్ పార్టీలో చేరాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

మరోవైపు ఇవాళ మంత్రి కేటీఆర్ పొన్నాలను కలవనున్నారని సమాచారం.ఈ నేపథ్యంలోనే పొన్నాల ఒకవేళ బీఆర్ఎస్ లోకి వస్తానంటే ఆహ్వానిస్తామని కేటీఆర్ ఇప్పటికే వెల్లడించిన విషయం తెలిసిందే.

ఈ పరిస్థితుల నేపథ్యంలో పొన్నాల కారు ఎక్కుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube