బిగ్ బాస్ ( Bigg Boss ) తెలుగు సీజన్ 7 ప్రస్తుతం ప్రసారమవుతున్న విషయం మనకు తెలిసిందే.ఈ కార్యక్రమం ప్రస్తుతం ఐదవారాలను పూర్తి చేసుకుని ఆరో వారం కూడా పూర్తి కావస్తుంది.14 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం నుంచి ఇప్పటికే ఐదుగురు కంటెస్టెంట్లు బయటకు వెళ్లారు.అయితే గత వారం మరొక ఐదుగురు కంటెస్టెంట్లు వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి అడుగు పెట్టారు.
ఇలా వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి అడుగు పెట్టినటువంటి వారిలో భోలే శవాలి ( Bhole Shavali ).చాలా డిఫరెంట్ గా అనిపించాడు.హడావడిగా మాట్లాడడం, పనులు చెయ్యడం, ఇతరుల విషయాల్లో కలగచేసుకోవడం చేస్తున్నారు.ఇలా ఈయన ఆటిట్యూడ్ చూసినటువంటి వారు కాస్త అతి పర్సన్ అంటూ కూడా ఈయనని సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు.

ఈ విధంగా బిగ్ బాస్ హౌస్ లో హడావిడి చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించినటువంటి శవాలి ఎవరు ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంటి అనే విషయానికి వస్తే…తెలంగాణ ప్రాంతంలోని మహబూబాబాద్ జిల్లాకి సంబంధించిన పెను గొండ అనే గ్రామానికి చెందిన వ్యక్తి.మధ్య తరగతి కుటుంబం నుండి వచ్చిన ఈయన, సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చే ముందు యూట్యూబ్ లో పలు ప్రైవేట్ వీడియోస్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ప్రభాస్ హీరోగా నటించిన బాహుబలి( Bahubali ) సినిమాలోని పచ్చబొట్టేసిన అనే పాటకు కీరవాణి సారథ్యంలో మ్యూజిక్ వాయించాడు.

ఇలా సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలకు మ్యూజిక్ కంపోస్ట్ చేయడమే కాకుండా తాజాగా వచ్చినటువంటి మ్యాడ్ సినిమాలోని పాటలు మొత్తానికి లిరిక్స్ అందించాడు.ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. భోలే శివాలి( ( Bhole Shavali ) ) ఎక్కువగా సింగర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.
ఇలా సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఈయన ఇప్పటివరకు సుమారు 15 కోట్ల వరకు ఆస్తిపాస్తులను సంపాదించారని తెలుస్తోంది.ఎక్కడో మారుమూల గ్రామంలో ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించినటువంటి శవాలి కోట్ల ఆస్తులను సంపాదించి ఎంతో మంచి గుర్తింపు పొంది ఇప్పుడు బిగ్ బాస్ ( Bigg Boss )అవకాశాన్ని అందుకున్నారు.
.






