ఇపుడు నెట్టింట కావచ్చు, బయట కావచ్చు, ఎక్కడ చూసినా కృత్రిమమేధ (Artificial Intelligence) గురించే చర్చలు నడుస్తున్నాయి.మరీ ముఖ్యంగా ఈమధ్య కాలంలో అయితే ఏఐ గురించి బాగా వినబడుతోంది.
దానికి కారణాలు కూడా మీకు తెలుసు.ఇక్కడ ప్రస్తావించాల్సిన అవసరం లేదు.
దాదాపు మనుషులు చేసిన పనులన్నిటినీ ఏఐ చేసేస్తోంది.అక్కడితో ఆగకుండా మనిషి చేయలేని పనులను కూడా చేసిపారేస్తోంది.
భవిష్యత్తుని ముందే ఊహించి ఎవరు ఎలా వుంటారో, ఎవరు ఎలా వుంటే బావుంటుందో ముందే ఊహించి ఊహా చిత్రాలను కూడా గీసి మరీ చూపెడుతోంది.దానికి ఉదాహరణగా మన సినిమా హీరోల బొమ్మలను పేర్కొనవచ్చు.
వారు చేయబోయే సినిమాలు, వారికి కావలిసిన పెళ్లిళ్లు, పిల్లలను గురించి కూడా చెప్పేస్తోంది.
మనం మొదటి నుండి కాస్త గమనిస్తే కొన్నాళ్ళ క్రితం కొన్ని చోట్ల A.I రోబో డాక్టర్స్ ని ( AI Doctors ) ప్రవేశపెట్టారు.ఇవి అతిక్లిష్టమైన సర్జరీని అతి సూక్ష్మమైన కత్తులు వినియోగించి, అతి కచ్చితత్వంతో అతి తక్కువ సమయంలో పని కానిచ్చేసింది.
ఇక్కడ రెండు ఉదంతాలు ఒకే కత్తికి ఉన్న రెండు పార్శాలు.అవును, మానవజాతిపై కృత్రిమ మేధ పొందిన రోబోలు ఆధిపత్యం చెలాయించే రోజులు రాబోతున్నాయనే చాలామంది ఇపుడు అనుకుంటున్నారు.1950లో అంటే ఇంటర్నెట్‌ను ఆవిష్కరించకమునుపే కృత్రిమ మేధకు బీజం పడిందని మీకు తెలుసా? అలన్ ట్యూరింగ్(Alan Turing), ‘కంప్యూటింగ్ మెషినరీ అండ్ ఇంటెలిజెన్స్’ అనే దార్శనిక పత్రంలో ‘మెషీన్లను ఆలోచింప చేయగలమా?’ అని ఒక ప్రశ్నను అడిగారట.

అలా 1956లో డార్ట్ మౌత్ (Dart Mouth) కాలేజీలో జరిగిన మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాన్ఫరెన్స్‌లో జాన్‌మెక్‌కార్తె (John Mc Carthy) Artificial Intelligence అనే పదాన్ని తొలిసారి ప్రయోగించారని సమాచారం.అదిగో అక్కడినుండే అసలు కధ మొదలయ్యింది.ఈ క్రమంలో 1967లో ఫ్రొవ్ రోసెన్ బ్లాట్ ట్రెయిల్ అండ్ ఎర్రర్ విధానంలో న్యూరల్ నెట్‌వర్క్‌ను ఏర్పరుచుకొని పనిచేసే తొలి కంప్యూటర్ ‘మార్క్ 1 పర్ సెప్ట్రాన్’ను రూపొందించారని వినికిడి.
దాంతో 1980లలో న్యూరల్ నెట్‌వర్క్ విధానాన్ని ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ లో విస్తృతంగా ఉపయోగించడం అనేది స్టార్ట్ అయింది.

1997లో IBM కంపెనీకి చెందిన ‘డీప్ బ్లూ’( Deep Blue ) కంప్యూటర్ ప్రపంచ చెస్ చాంపియన్ అయిన గ్యారీ కాస్థరోవ్‌ను చదరంగంలో ఓడించడం మీకు గుర్తుందా? ఇక ఇపుడు 2023లో ‘చాట్ జీపీటీ’( ChatGPT ) ఏఐ అనువర్తనాల్లో సరికొత్త సాంకేతిక విప్లవానికి తెరలేపింది.ప్రస్తుతం ఇది చేస్తున్న అద్భుతాలు గురించి ఇక్కడ ప్రస్తావించాల్సిన పనిలేదు అందరికీ తెలిసిందే.దీనిపైన కొందరు పాజిటివ్ దృక్ఫధంతో వుంటే, మరికొందరు మాత్రం వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టు ఇది ఎక్కడకు దారి తీస్తుందో అని భీతి చెందుతున్న పరిస్థితి నెలకొంది.