హన్మకొండ జిల్లాలో కాల్పుల కలకలం చెలరేగింది.అత్తను అల్లుడు కాల్చి చంపాడు.
ఈ ఘటన స్థానికంగా తీవ్ర కల్లోలం సృష్టించింది.
తోటపల్లిలో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న అడ ప్రసాద్ తన సర్వీస్ రివాల్వర్ తో అత్త కమలను కాల్చి చంపాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.ఈ క్రమంలోనే కానిస్టేబుల్ ను అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం అత్తను హత్య చేయడానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.అయితే ఆర్థిక లావాదేవీల కారణంగా హత్య జరిగి ఉండవచ్చని బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.







