దసరా సీజన్ లో కూడా మన టాలీవుడ్ లో స్టార్ హీరోలు బరిలోకి దిగుతారు.బాక్సాఫీస్ దగ్గర తమ సినిమాలతో దండయాత్ర చేయడానికి ఊహించని విధంగా మూడు క్రేజీ ప్రాజెక్టులు సిద్ధం అవుతున్నాయి.
ఇక మన టాలీవుడ్ హీరోల్లో నందమూరి బాలకృష్ణ, ( Balakrishna )మాస్ రాజా రవితేజ ( Ravi Teja )ఢీ అంటే ఢీ అంటూ పోటీకి సై అంటూ యుద్ధానికి సిద్ధం అంటూ సమరానికి రెడీ అవుతున్నారు.
బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘‘భగవంత్ కేసరి’‘ ( Bhagavanth Kesari ) తెరకెక్కుతుంది.
దసరా కానుకగా అక్టోబర్ 19న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.తండ్రి, కూతురు మధ్య సెంటిమెంట్ తో తెరకెక్కిన సినిమా ఇది.నిన్న ట్రైలర్ తో అదిరిపోయే లెవల్లో అంచనాలు పెంచేసుకుంది.బాలయ్య తండ్రి పాత్రలో చేయడం, పక్కా తెలంగాణ నేపథ్యంలో ఈయన చెప్పిన డైలాగ్స్ అన్ని కూడా సినిమాపై అంచనాలను తారా స్థాయికి చేర్చేసాయి.

ఇక మాస్ రాజా రవితేజ నటిస్తున్న సినిమా కూడా ఇందుకు భిన్నంగా ఏం లేదు.రవితేజ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ”టైగర్ నాగేశ్వరరావు” ( Tiger Nageswara Rao ).వంశీ డైరెక్ట్ చేసిన ఈ సినిమా బయోపిక్ గా తెరకెక్కడంతో మంచి కంటెంట్ తో ఈ సినిమా తెరకెక్కింది అనే చెప్పాలి.స్టువర్ట్ పురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా బాలయ్య కంటే ఒకరోజు లేట్ గా రాబోతుంది.

ఇప్పటి వరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ తో అన్నివిధాలుగా ఈ రెండు సినిమాలపై భారీ అంచనాలు పెరిగాయి.ఈ రెండింటితో పాటు విజయ్ లియోతో అక్టోబర్ 19నే బరిలోకి దిగబోతున్నాడు.లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లియో సినిమా భగవంత్ కేసరి ఓపెనింగ్స్ కు గండికొట్టే అవకాశం కనిపిస్తుంది.
లియో ( Leo ) ట్రైలర్ తో పెద్దగా అంచనాలు క్రియేట్ చేయకపోయినా బాలయ్య సినిమాపై ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది.
మరి మాస్ రాజా మాత్రం అక్టోబర్ 20న రాబోతున్నాడు.దీంతో భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు ల్లో ఎవరు దసరా విజేతగా బరిలో నిలుస్తారో ఎవరు బ్లాక్ బస్టర్ అందుకుంటారో వేచి చూడాలి.







