సితార పరిచయం అవసరం లేని పేరు.పట్టుమని 15 సంవత్సరాలు కూడా లేనటువంటి ఈ చిన్నారికి ఇండస్ట్రీలో హీరోయిన్ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పాలి.
ఘట్టమనేని వారసురాలిగా సూపర్ స్టార్ మహేష్ బాబు ( Mahesh Babu ) కూతురుగా అందరికీ ఎంతో సుపరిచితమైనటువంటి సితార ( Sitara ) ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున అందరి దృష్టిని ఆకర్షిస్తూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.మహేష్ బాబు వారసురాలుగా అందరికీ ఎంతో సుపరిచితమైనటువంటి ఈమె చిన్న వయసులోనే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.

ఇంత చిన్న వయసులోనే తనకంటూ ఒక యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి ఎన్నో కవర్ సాంగ్స్ చేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.ఇలా రోజు రోజుకు ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి సితార ఇన్ని రోజులు కేవలం సోషల్ మీడియాలో మాత్రమే యాక్టివ్ గా ఉండేవారు.అయితే ఈ మధ్యకాలంలో ఈమె పెద్ద ఎత్తున మీడియా దృష్టిని ఆకర్షిస్తున్నారని చెప్పాలి.ఇలా ఉన్నఫలంగా మహేష్ బాబు నమ్రత( Namrata ) తన కుమార్తె సితారను ఇంతగా హైలెట్ చేయడానికి కారణం ఏంటి ఇలా సితారను హైలెట్ చేయడం వెనుక ఏదైనా స్ట్రాటజీ ఉందా అందుకే తనని అందరికీ పరిచయం చేస్తున్నారా అంటూ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.

ఇన్ని రోజులపాటు చదువు పైన అలాగే సోషల్ మీడియాకి( Social media ) మాత్రమే పరిమితమై ఉన్నటువంటి సితార ఒక్కసారిగా ఒక జువెలరీ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించారు.అలాగే పలు షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవ కార్యక్రమాలకు కూడా హాజరవుతూ మీడియా దృష్టిని అలాగే ప్రేక్షకుల దృష్టిని కూడా ఆకర్షిస్తున్నారు.ఇక నమ్రత అయితే సితార వెంటే ఉంటూ తనని భారీగానే ఎంకరేజ్ చేస్తున్నారు.ఇలా సితారను హైలెట్ చేయడం వెనుక మహేష్ బాబు భారీగానే ప్లాన్ వేశారని తెలుస్తుంది.

ఇప్పటినుంచి అందరి దృష్టిలో సితార ( Sitara ) ఉంటే తాను హీరోయిన్ అయిన తర్వాత ఎంతో మంచి సక్సెస్ అందుకుంటుందని అందుకే ఇప్పటినుంచి సితారను అన్నిచోట్లకు తీసుకువస్తూ అందరికీ పరిచయం చేస్తూ తనని హైలెట్ చేస్తున్నారని తెలుస్తోంది.ఒకానొక సమయంలో సూపర్ స్టార్ కృష్ణ కూడా మహేష్ బాబు విషయంలో ఇదే స్ట్రాటజీ ఫాలో అయ్యారు.తనని హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేసే ముందు కృష్ణ సైతం మహేష్ బాబుని ఈ విధంగానే హైలెట్ చేశారు.అనంతరం ఈయన హీరోగా వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.
ఇప్పుడు మహేష్ బాబు ( Mahesh Babu ) కూడా తన కూతురి విషయంలో ఇదే ఫార్ములా ఫాలో అవుతున్నారని అందుకే తనని కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎదగడానికి ప్రోత్సహిస్తున్నారని తెలుస్తోంది.ఇప్పటికే ఈమె ఎన్నో సేవా కార్యక్రమాలలో కూడా పాల్గొంటూ తన మంచి మనసును చాటుకుంటున్న విషయం మనకు తెలిసిందే.







