Sivaji : బిగ్ బాస్ కోసం నా ప్రాణానికి ప్రాణమైన రెండో పెళ్ళాన్ని వదిలేసి వచ్చా.. శివాజీ కామెంట్స్ వైరల్..!!

బిగ్ బాస్ సీజన్ 7 ( Bigg boss season 7) అంత ఉల్టా పల్టాగా నాగార్జున చెప్పినట్టే సాగుతోంది.అయితే చూడ్డానికి కాస్త బోరింగ్ గా అనిపించినప్పటికీ ఈ వారమే అసలైన ఆట మొదలైంది అని తెలుస్తోంది.

 Did I Leave My Second Wife Because Bigg Boss Sivajis Comments Are Viral-TeluguStop.com

ఈ వారం పవర్ అస్త్రలన్నింటిని తీసేసుకున్నారు బిగ్ బాస్.అలాగే బిగ్ బాస్ ఇంటికి మొదటి కెప్టెన్ ఎవరు అనే దానికి ఒక గేమ్ పెట్టారు.

ఇందులో జంటలు జంటగా విడిపోయి ఎవరి ఆట వాళ్ళు ఆడారు.ఇక చివర్లో యావర్ తేజ ( Yawar ,Teja ) కోసం తన ఇంటి నుండి వచ్చిన లెటర్ ని త్యాగం చేశారు.

అలాగే శుభశ్రీ గౌతమ్ కోసం త్యాగం చేసింది.ఇక అమర్ దీప్ సందీప్ జంటలో సందీప్ అమ్మ హెల్త్ బాగాలేదు అని చెప్పడంతో అమర్దీప్ తన లెటర్ ని త్యాగం చేశాడు.

Telugu Amar Deep, Biggboss, Goutham, Sandeep, Sivaji, Subha Sri, Tasty Teja, Yaw

ఇక శివాజీ ప్రశాంత్ ల జోడిని బిగ్ బాస్ యాక్టివిటీ రూమ్ లోకి పిలిపించుకొని ప్రశాంత్ కి లెటర్ ని అలాగే శివాజీ ( Shivaji) కి ఎంతో ఇష్టమైన కాఫీని తన భార్య పంపిన లెటర్ ని పంపించాడు.అయితే కాఫీ ని చూడగానే లొట్టలు వేసుకుంటూ శివాజీ అబ్బ ఎన్నాళ్ళకెన్నాళ్లకు అని ఒక సిప్ తాగాడు.ఆ తర్వాత ప్రశాంత్ కోసం నేను నా లెటర్ ని త్యాగం చేస్తున్నాను.ఎందుకంటే ఈ లెటర్లో నా భార్య ఏం రాస్తుందో నాకు తెలుసు.అయితే నేను ఇక్కడికి గెలవడానికే వచ్చాను.

Telugu Amar Deep, Biggboss, Goutham, Sandeep, Sivaji, Subha Sri, Tasty Teja, Yaw

కానీ మొదటిసారి హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వగానే ప్రశాంత్ ( Prashanth ) నన్ను హత్తుకుని అన్న ఎవరు నాతో మాట్లాడడం లేదు అని చెప్పారు.కానీ అన్ని విషయాల్లో నీకు తోడు గా ఉంటాను అని నేను ప్రశాంత్ కి మాట ఇచ్చాను.ఇక ఎవరు ఏమి అనుకున్నా కూడా నేను ప్రశాంత్ కోసం నా లెటర్ త్యాగం చేస్తాను.

ఎందుకంటే ఒక రైతు బిడ్డ ఇక్కడ దాకా రావడం అనేది మామూలు విషయం కాదు.అందుకే వాడికి సపోర్ట్ చేస్తూ వాడి హద్దుల్లో వాడిని ఉండమని చెబుతాను.

నాకు ఈ కాఫీ ఒక్కటి చాలు.లెటర్ లో నా భార్య ఏం రాస్తుందో నాకు తెలుసు.

నీకోసం త్యాగం చేస్తున్నాను నువ్వే కంటెండర్ వి.ఇక ఏం మాట్లాడకు అంటూ ప్రశాంత్ కోసం త్యాగం చేశారు.నేను బిగ్ బాస్ ( Biggboss ) హౌస్ కి నా భార్య, కొడుకుల్ని వదిలిపెట్టి వచ్చేసాను.మరీ ముఖ్యంగా నాకు ఎంతో ఇష్టమైన కాఫీని నా రెండో పెళ్లాం గా చెప్పుకుంటాను.

అలాంటిది నా ప్రాణానికి ప్రాణమైన రెండో భార్య కాఫీని వదిలిపెట్టి ఇక్కడి వరకు వచ్చాను.ఇక నువ్వు పిచ్చి పిచ్చి పనులు చేయకుండా మీ అమ్మానాన్నలు పంపిన లెటర్ ని చదువుకో.

నువ్వు నీ లెటర్ ని క్రాష్ చేస్తే మాత్రం నా మీద ఒట్టే అంటూ శివాజీ చెప్పారు.ఇక శివాజీ మాటలతో ప్రశాంత్ తన పేరెంట్స్ రాసిన లెటర్ చదువుకొని ఎమోషనల్ అయ్యారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube