ఈ నెల 4వ తేదీన తెలంగాణ పోలీస్ కానిస్టేబుళ్ల( Constable ) తుది ఎంపికకు సంబంధించిన ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే.ఈ ఫలితాలలో జగిత్యాల జిల్లాలోని తాట్లవాయికి చెందిన రాజేశ్వరి గంగరాం దంపతుల కుమారుడు శ్రీకాంత్ టీ.
ఎస్.పీఎస్సీ ( TSPSC )ఉద్యోగానికి ఎంపికై వార్తల్లో నిలిచారు. శ్రీకాంత్ తల్లి బీడీ కార్మికురాలుగా పని చేస్తుండగా తండ్రి వ్యవసాయ కూలీగా పని చేస్తుండటం గమనార్హం.

శ్రీకాంత్( Srikanth ) ఎమ్మెస్సీ కెమిస్ట్రీ చదవగా ఇప్పటికే అతనికి ఆర్.ఆర్.బీలో గ్రూప్ డి జాబ్ వచ్చింది.అయితే గ్రూప్ డి జాబ్ ను వదిలేసి తెలంగాణ కానిస్టేబుల్ పరీక్షల కోసం శ్రీకాంత్ ప్రిపేర్ కాగా తొలి ప్రయత్నంలోనే మంచి ఫలితాలు వచ్చాయి.మొదటి ప్రయత్నంలోనే కానిస్టేబుల్ జాబ్ కు ఎంపిక కావడం తనకు ఎంతగానో సంతోషాన్ని కలిగిస్తోందని ఆయన చెప్పుకొచ్చారు.
తన సక్సెస్ స్టోరీతో శ్రీకాంత్ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

దేశంలో లక్షల సంఖ్యలో నిరుద్యోగులు ప్రభుత్వ పరీక్షలలో అనుకూల ఫలితాలను సొంతం చేసుకోవడం కోసం ఎంతగానో కష్టపడుతున్నారు.కొంతమందికి సులువుగానే అనుకూల ఫలితాలు వస్తే మరి కొందరు ఎంత ప్రయత్నించినా అనుకూల ఫలితాలు రావడం లేదు.సరైన ప్రణాళికతో పరీక్షలకు సిద్ధమైతే మాత్రం పోటీ పరీక్షలలో అనుకూల ఫలితాలు సాధించడం సులువు కాదు.
కోచింగ్ తీసుకుని పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయితే కొన్నిసార్లు ఆశించిన ఫలితాలు రాకపోయినా ఏదో ఒకరోజు ప్రభుత్వ ఉద్యోగం సాధించే అవకాశాలు అయితే ఉంటాయి.ఓటమి ఎదురైనా సరైన ప్రణాళికతో ముందడుగులు వేస్తే అలస్యంగానైనా అనుకూల ఫలితాలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాబోయే రోజుల్లో మరిన్ని భారీ జాబ్ నోటిఫికేషన్ల దిశగా అడుగులు వేస్తూ నిరుద్యోగులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఊహించని స్థాయిలో బెనిఫిట్ కలిగిస్తుండటం గమనార్హం.








