ఏపీలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో వైసీపీ కసరత్తు మొదలు పెట్టింది.ఈ మేరకు ఎన్నికల కోసం వైసీపీ శ్రేణులను సీఎం జగన్ సమాయత్తం చేయనున్నారు.
ఇందులో భాగంగా ఈనెల 9వ తేదీన వైసీపీ శ్రేణులతో సీఎం జగన్ కీలక సమావేశం నిర్వహించనున్నారు.విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరగనున్న ఈ భేటీలో సుమారు ఎనిమిది వేల మంది మండల స్థాయి నాయకులు పాల్గొననున్నారు.
అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలతో పాటు మార్కెట్ యార్డు ఛైర్మన్లు ఈ సమావేశానికి హాజరుకానున్నారు.ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా సీఎం జగన్ వారికి దిశానిర్దేశం చేయనున్నారు.







