తెలంగాణలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలకు మొత్తం 36 సీట్లు వస్తాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.మిగతా అన్ని స్థానాల్లోనూ కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణ సెంటిమెంట్ పేరుతో దోపిడీ చేశారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.మ్యానిఫెస్టో పేరుతో బీఆర్ఎస్ కొత్తగా ఏం చెబుతుందని ప్రశ్నించారు.
కాంగ్రెస్ కు అనుకూలంగా సర్వేలు వస్తున్నాయన్న రేవంత్ రెడ్డి టికెట్లు రాని వారికి ఇతర పదవులు ఇచ్చి న్యాయం చేస్తామని చెప్పారు.ఎవరు ఏం చెప్పినా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.







