తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా అడుగుపెట్టినటువంటి వారిలో దివంగత నటుడు ఉదయ్ కిరణ్( Uday Kiran ) ఒకరు.ఈయన ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి తేజ(Teja ) దర్శకత్వంలో చిత్రం సినిమా( Chitram Movie ) ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఉదయ్ కిరణ్ అందరి దృష్టిని ఆకర్షించారు.అయితే అనంతరం తన రెండవ సినిమా కూడా తేజ దర్శకత్వంలోనే చేసి బ్లాక్ బాస్టర్ అందుకోవడంతో ఈయనకు ఇండస్ట్రీలో ఎంతో మంచి క్రేజ్ వచ్చింది.
ఇలా ఇండస్ట్రీలో బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలతో దూసుకుపోతున్నటువంటి ఉదయ్ కిరణ్ దూకుడు చూసి ఇండస్ట్రీ పెద్దలు కూడా ఆశ్చర్యపోయారు.ఈయన సినిమా వస్తుంది అంటే స్టార్ హీరోలైనటువంటి చిరంజీవి బాలకృష్ణ వంటి వారి సినిమాలను కూడా పోస్ట్ పోన్ చేసుకొనే స్థాయికి ఎదిగారు.అయితే ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ఇంత మంచి సక్సెస్ అందుకోవడం చూసినటువంటి కొందరు ఈయనని అనగదొక్కే ప్రయత్నం చేశారు.అయితే ఈ ప్రయత్నంలో ఆ స్టార్ సెలబ్రెటీలు మంచి సక్సెస్ అయ్యారనే చెప్పాలి.
ఇలా ఉదయ్ కిరణ్ ఇండస్ట్రీలో అంచలంచలుగా ఎదుగుతూ ఉంటే తమకు తమ పిల్లలకు కెరియర్ ఉండదనీ భావించినటువంటి కొంతమంది స్టార్ సెలబ్రిటీలు( Star Celebrities ) ఈయనకు అవకాశాలు ఇవ్వకుండా దర్శక నిర్మాతలను బ్లాక్ మెయిల్ చేశారట.అలాగే ఈయన నటించిన సినిమాలు పెద్దగా థియేటర్లలో విడుదల అవ్వడానికి కూడా అడ్డుకునేవారు దీంతో ఈయన కెరియర్ మెల్లిమెల్లగా పతనమవుతూ వచ్చింది.
చివరికి సినిమా అవకాశాలు కూడా లేకుండా చేస్తూ ఈయనని ఎంతో ఆర్థిక ఇబ్బందులలోకి నెట్టివేశారు.
ఇలా ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు మరొకవైపు సినిమా అవకాశాలే లేవు.దీంతో ఎన్నో బాధలను అనుభవిస్తూ చివరికి సూసైడ్ చేసుకొని మరణించారు.ఇలా ఉదయ్ కిరణ్ మరణించడంతో ఎంతోమంది అభిమానులు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయారు.
ఇప్పటికీ ఉదయ్ కిరణ్ మరణ వార్త ఒక మిస్టరీగానే ఉంది అయితే ఉదయ్ కిరణ్ మరణించడానికి పరోక్షంగా రాజమౌళి ( Rajamouli ) కూడా కారణమే అంటూ ఒక వార్త వైరల్ గా మారింది.రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సై( Sye ) సినిమా గురించి అందరికీ తెలిసిందే.
ఈ సినిమాలో ముందుగా నటించే అవకాశం ఉదయ్ కిరణ్ కి వచ్చిందట అయితే కొన్ని కారణాలవల్ల నితిన్ ఈ సినిమాలో నటించే సక్సెస్ అందుకున్నారు.
ఇలా ఈ విషయం గురించి ఇదివరకే వార్తలు వచ్చాయి అయితే ఉదయ్ కిరణ్ స్థానంలో నితిన్( Nithin ) ఎలా వచ్చారు అన్న విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.కొందరు స్టార్ హీరోలు తమ ఇన్ఫ్లుయన్స్ ఉపయోగించి ఈ సినిమాలో ఉదయ్ కిరణ్ నటించకూడదని రాజమౌళిని కాకుండా ఈ సినిమాకు స్పాన్సర్స్ చేసే వారిని బెదిరించారట ఈ సినిమాలో ఉదయ్ కిరణ్ నటిస్తే ఈ సినిమాకు మేము చేసే స్పాన్సర్స్ క్యాన్సిల్ చేసుకుంటాము అంటూ స్పాన్సర్స్ రాజమౌళిని బెదిరించారట.ఇలా బెదిరించడంతో తప్పనిసరి పరిస్థితులలో రాజమౌళి ఈ సినిమా నుంచి ఉదయ్ కిరణ్ ని తప్పించి నితిన్ కి ఆ అవకాశం కల్పించారు.
ఒకవేళ ఈ సినిమాలో కనుక ఉదయ్ కిరణ్ నటించిన ఆయన లైఫ్ తిరిగి మరోసారి గాడిలో పడేదని నేడు ఆయన మన ముందు ఇండస్ట్రీలో ఉండేవారు అంటూ అభిమానులు భావిస్తున్నారు.ఉదయ్ కిరణ్ మరణానికి పరోక్షంగా రాజమౌళి కూడా కారణం అంటూ ఈ వార్తను వైరల్ చేస్తున్నారు.